Hijab Law: ఉధృతంగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమం.. హిజాబ్ రూల్‌ తొలగించనున్న ఇరాన్?

దశాబ్దాలుగా అమలు చేస్తున్న హిజాబ్ చట్టాన్ని ఇరాన్ రద్దు చేయబోతుందా? దేశవ్యాప్తంగా సాగుతున్న ఆందోళనల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వంలో మార్పు వచ్చిందా? తాజా విషయం ఏంటంటే..

Hijab Law: ఉధృతంగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమం.. హిజాబ్ రూల్‌ తొలగించనున్న ఇరాన్?

Hijab Law: హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సంగతి తెలిసిందే. గత సెప్టెంబర్‌లో మహ్సా అమిని అనే యువతిని హిజాబ్ ధరించని కారణంగా ఇరాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె పోలీసుల కస్టడీలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

India vs Bangladesh: బంగ్లాదే‌శ్‌ సిరీస్.. నేడే భారత తొలి వన్డే.. ఉదయం 11.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

హిజాబ్ నిబంధనకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. ప్రభుత్వం వెంటనే ఈ నిబంధన తొలగించాలంటూ మహిళలు, కొందరు పురుషులు ఆందోళనలు చేశారు. ఇరాన్‌లోని అనేక ప్రాంతాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రభుత్వం పోలీసుల్ని, సైనిక బలగాల్ని ప్రయోగించింది. సైనికుల కాల్పుల్లో వందల మంది మరణించారు. వేల మందిని అరెస్టు చేశారు. అయినప్పటికీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా.. ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. పైగా అంతర్జాతీయంగా ఈ ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. హిజాబ్ చట్టంపై సమీక్షిస్తున్నట్లు ఇరాన్ అధికార వర్గాలు తెలిపాయి.

Perennial Rice: సరికొత్త వరి పంట.. ఒక్కసారి నాటితే నాలుగేళ్లు పండే వరిని అభివృద్ధి చేసిన చైనా

దశాబ్దాలుగా హిజాబ్ చట్టాన్ని ఇరాన్‌లో కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ చట్టంలో ఇప్పుడు మార్పులు తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఇరాన్ అటార్నీ జనరల్ మొహ్మద్ జాఫర్ తెలిపారు. దీనికోసం పార్లమెంటు, న్యాయ వ్యవస్థ ఇప్పటికే పని చేస్తున్నాయన్నారు. అయితే, హిజాబ్ పూర్తిగా రద్దు చేస్తారా? లేక ఏవైనా మార్పులు చేస్తారా? అనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే అక్కడ రోడ్లపై హిజాబ్ తగలబెడుతూ మహిళలు ఆందోళన చేపడుతున్నారు.