Russia-Ukraine War: రష్యాకు మిస్సైల్స్, డ్రోన్స్ ఇస్తున్న ఇరాన్.. యుక్రెయిన్‌కు యాంటీ-డ్రోన్ సిస్టమ్ ఇస్తామంటున్న నాటో

రష్యా-యుక్రెయిన్‌ యుద్ధంలోకి నాటోతోపాటు, ఇరాన్ కూడా చేరుతోంది. అయితే, అది పరోక్షంగా. రష్యాకు మరిన్ని డ్రోన్లు, మిస్సైల్స్ ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. దీనికి ప్రతిగా తాము యాంటీ-డ్రోన్ సిస్టమ్ ఇస్తామని నాటో తెలిపింది.

Russia-Ukraine War: రష్యాకు మిస్సైల్స్, డ్రోన్స్ ఇస్తున్న ఇరాన్.. యుక్రెయిన్‌కు యాంటీ-డ్రోన్ సిస్టమ్ ఇస్తామంటున్న నాటో

Russia-Ukraine War: రష్యా-యుక్రెయిన్ యుద్ధం ముదురుతోంది. మెల్లిగా ఈ యుద్ధంలో ఇతర దేశాల ప్రమేయం పెరుగుతోంది. తాజాగా రష్యాకు డ్రోన్లు, ఉపరితల క్షిపణులు అందిస్తామని ఇరాన్ ప్రకటించింది. దీనికి ప్రతిగా యుక్రెయిన్‌కు తాము యాంటీ-డ్రోన్ సిస్టమ్ ఇస్తామని నాటో వెల్లడించింది.

Solar Eclipse: ఈ నగరాల్లోనే సూర్యగ్రహణం.. హైదరాబాద్‌లో కనిపిస్తుందా? ఈసారి మిస్సైతే మళ్లీ పదేళ్ల తర్వాతే!

ఇప్పటికే రష్యా డ్రోన్ల దాడులతో యుక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతుంటే, ఈ దాడులను సమర్ధిస్తూ ఇరాన్ మరిన్ని డ్రోన్లు అందిస్తామని హామీ ఇచ్చింది. సోమవారం రష్యా యుక్రెయిన్‌పై భారీ స్థాయిలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పలువురు పౌరులు కూడా మరణించారు. దీంతో ఈ దాడుల్ని ఎదుర్కొనేందుకు తాము యుక్రెయిన్‌కు యాంటీ-డ్రోన్ సిస్టమ్ అందజేస్తామని నాటో అధ్యక్షుడు జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ప్రకటించారు. బెర్లిన్‌లో జరిగిన ఒక సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. తాము అందించే యాంటీ-డ్రోన్ సిస్టమ్ ద్వారా యుక్రెయిన్‌… డ్రోన్ దాడుల నుంచి తమను తాము రక్షించుకోగలదని జెన్స్ అన్నారు.

Delhi Woman: మహిళను ఎత్తుకెళ్లి ఐదుగురి సామూహిక అత్యాచారం.. ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన

మరోవైపు రష్యాకు డ్రోన్లు సరఫరా చేస్తామని ఇరాన్ ప్రకటించడంపై యుక్రెయిన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశంతో దౌత్యపరమైన సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. ఇక యుక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. అక్కడి కీలక ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకుంటోంది. ఈ దాడుల్లో సామాన్య పౌరులు కూడా భారీగా మరణిస్తున్నారు.