ఎర్ర జెండా ఎగరేశారు : ఇక మూడో ప్రపంచ యుద్ధమే..?

అమెరికా ఇరాన్ మధ్య ఏం జరగబోతోంది. దెబ్బకి దెబ్బ తీయడమే ఇరాన్ చేయబోతోందా? అదే జరిగితే అమెరికా అణ్వాయుధం వాడేందుకు సిద్ధమైందా? ప్రస్తుత పరిణామాలు,

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 02:56 AM IST
ఎర్ర జెండా ఎగరేశారు : ఇక మూడో ప్రపంచ యుద్ధమే..?

అమెరికా ఇరాన్ మధ్య ఏం జరగబోతోంది. దెబ్బకి దెబ్బ తీయడమే ఇరాన్ చేయబోతోందా? అదే జరిగితే అమెరికా అణ్వాయుధం వాడేందుకు సిద్ధమైందా? ప్రస్తుత పరిణామాలు,

అమెరికా ఇరాన్ మధ్య ఏం జరగబోతోంది. దెబ్బకి దెబ్బ తీయడమే ఇరాన్ చేయబోతోందా? అదే జరిగితే అమెరికా అణ్వాయుధం వాడేందుకు సిద్ధమైందా? ప్రస్తుత పరిణామాలు, దేశాధినేతల మధ్య మాటలు చూస్తుంటే అలానే కన్పిస్తోంది. ఇదే జరిగితే ఇక మూడో ప్రపంచ యుద్ధమే వస్తుందంటూ ప్రపంచ దేశాల్లో ఆందోళనలు ప్రారంభమయ్యాయ్. 

21వ శతాబ్దంలో మొదటి.. మొత్తంగా చూస్తే.. మూడో ప్రపంచ యుద్ధానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది..తమ కమాండర్‌ని చంపినందుకు పగ తీర్చుకుంటామని చెప్పిన ఇరాన్..అందుకు తగ్గట్లే అడుగులు కూడా వేస్తోంది. చరిత్రలో మొట్టమొదటిసారిగా జంకారా మసీద్ డోమ్‌పై రెడ్ ఫ్లాగ్‌ని ఇరాన్ ఎగరవేసింది..ఇది విప్లవానికి మాత్రమే కాదు..చైతన్యానికి కూడా సంకేతంగా చూస్తారు..కానీ మసీద్ పైభాగంలో ఎర్రజెండా ఎగరవేయడమనేది..యుద్ధానికి కూడా సంకేతంగా చెప్తారు..అంటే ఇక ఇరాన్ అమెరికాతో తాడో పేడో తేల్చుకునేందుకు డిసైడ్ అయినట్లు కన్పిస్తోంది.

షియా ముస్లింల ఆచారం ప్రకారం.. అన్యాయంగా రక్తం చిందిందనడానికి, ప్రతీకారం తీర్చుకోవాలనడానికి ఎర్ర జెండాలను సూచికలుగా భావిస్తారు. అప్పుడెప్పుడో క్రీ.శ. 680లో కర్బాలా యుద్ధం తర్వాత ఎర్రజెండా ఎగరేశారని చరిత్రలో ఉంది. అప్పటి ఆ యుద్ధంలో మహ్మద్ ప్రవక్త మనవడైన ఇమామ్ హుస్సేన్ చనిపోగా.. షియా సంప్రదాయం ప్రకారం పగ తీర్చుకున్నాకే ఆ జెండాను కిందకు దించుతారు. దీంతో ఇప్పటికీ ఆ జెండాను అవనతం చేయలేదు.

మరోవైపు ఖాసీం సులేమానీ అంత్యక్రియల్లో పాల్గొన్న వేలాదిమంది ఇరాన్ వాసులు దెబ్బకి దెబ్బ తీయాలంటూ నినాదాలు చేశారు. సులేమానీ అంతిమ యాత్రలో.. అమెరికాను సైతాన్‌తో పోల్చుతూ ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో జనం నినాదాలు చేశారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్‌ని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.. ఇరాన్‌లోని కీలకమైన 52 ప్రదేశాలను తాము టార్గెట్ చేసినట్లు చెప్పారు..తాము అనుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా మెరుపు దాడి చేయగలమంటూ ట్వీట్ చేశారు. తమ జోలికి వస్తే…అందమైన ఆయుధంతో అంతు చూస్తామన్నారు. దీంతో అమెరికా న్యూక్లియర్ వార్ జోలికి వెళ్తుందేమో అన్న సందేహం ప్రారంభమైంది. ఈ కవ్వింపు చర్యతోనే ఇరాన్ తమ జంకారా మసీద్‌ డోమ్‌పై రెడ్ ఫ్లాగ్ ఎగరేసిందంటున్నారు. తాము తలుచుకుంటే అమెరికాని మట్టి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఖాసిం సులేమానీ అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఇరాన్ పార్లమెంట్ సమావేశమైంది. ఇందులోనే ఎంపీ అబుటోరఫీ ..వైట్ హౌస్‌నే స్మాష్ చేస్తామంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు..

మరోవైపు లెబనాన్ కి చెందిన సైనికులు..ఇరాక్ నుంచి వైదొలుగుతుండగా..అమెరికా మాత్రం తమ సైనికులను వేలాదిగా తరలిస్తోంది. ఇరాన్ మసీదుపై ఎర్ర జెండా ఎగరేయడం.. ట్రంప్ కవ్వింపు.. ఇరాన్ తెగింపు చూస్తుంటే.. ఇక ప్రపంచ యుద్ధమే తరువాయి అన్నట్లుగా పరిస్థితులు మారాయ్.

Also Read : ఇరాన్‌తో యుద్ధం ముప్పు రాబోతుందా?