8 నెలలు నిఘా పెట్టి.. టన్ను బరువైన ఆటోమాటెడ్ గన్‌తో ఇరాన్ అణు శాస్త్రవేత్తను కాల్చిచంపారు!

8 నెలలు నిఘా పెట్టి.. టన్ను బరువైన ఆటోమాటెడ్ గన్‌తో ఇరాన్ అణు శాస్త్రవేత్తను కాల్చిచంపారు!

Iranian nuclear scientist killed by one-ton automated gun : 8 నెలల పాటు నిఘా పెట్టి మరి.. ఇరాన్ అణు శాస్త్రేవేత్తను అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశారు. గత నవంబర్ నెలలో టెహ్రాన్ సమీపంలో ఒక టన్ను బరువైన ఆటోమాటెడ్ తుపాకీతో ఈ దాడి చేసినట్టు ఒక నివేదిక వెల్లడించింది.

ఇరాన్‌లోకి అక్రమంగా రవాణా చేసిన తుపాకీతో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ సైంటిస్టు మొహ్సేన్ ఫఖ్రిజాదేను హతమార్చినట్టు నివేదిక పేర్కొంది. ఇజ్రాయెల్, ఇరానియన్ జాతీయులతో సహా 20 మందికి పైగా ఏజెంట్ల బృందం ఎనిమిది నెలల నిఘా తర్వాత శాస్త్రవేత్త మొహ్సేన్ పై దాడి చేసినట్లు తెలిపింది.

లండన్‌కు చెందిన వార్తాపత్రిక వెబ్‌సైట్‌లో ఈ నివేదికను ప్రచురించింది. సైంటిస్టు మొహ్సేన్ తన కారులో వెళ్తుండగా సాయుధ దుండగులు తుపాకీ కాల్పులు జరిపారు. ఆస్పత్రిలో చేరిన ఫఖ్రిజాదే మరణించారని ఇరాన్ మీడియా తెలిపింది. సైంటిస్టు హత్యకు కారణం ఇజ్రాయెల్ కారణమంటూ ఇరాన్ ఆరోపించింది. నవంబర్ నెలలో ఇజ్రాయెల్ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. 59 ఏళ్ల ఫఖ్రిజాదే రహస్య అణు బాంబు కార్యక్రమానికి సూత్రధారి అని పశ్చిమ దేశాలు చాలాకాలంగా అనుమానించాయని పేర్కొంది.

2003లో పాశ్చాత్య ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అతన్ని రహస్య అణు బాంబు కార్యక్రమానికి రహస్య సూత్రధారిగా వ్యవహరించినట్టు  అభివర్ణించారు. సైంటిస్టుపై దాడి ఇజ్రాయెల్ చేసిందని, ఇందులో అమెరికన్ ప్రమేయం లేకుండా జరిగిందని, యుఎస్ అధికారులకు ముందే కొన్ని రకాల నోటీసులు అందినట్టు నివేదిక పేర్కొంది.