కుల్ భూషణ్ జాదవ్ ని కిడ్నాప్ చేసిన ఇరాన్ టాప్ టెర్రరిస్ట్ హతం

  • Published By: venkaiahnaidu ,Published On : November 18, 2020 / 08:15 PM IST
కుల్ భూషణ్ జాదవ్ ని కిడ్నాప్ చేసిన ఇరాన్ టాప్ టెర్రరిస్ట్ హతం

Iran’s top terrorist killed in Balochistan ఇరాన్ టాప్ మోస్ట్ టెర్రరిస్ట్ ‘ముల్లా ఒమర్ ఇరానీ’ పాక్ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యాడు. నవంబర్-17న బలూచిస్తాన్ ప్రావిన్స్(రాష్ట్రం)లోని కెచ్ జిల్లాలోని తుర్బాత్ పట్టణంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇరానీ,అతని ఇద్దరు కుమారులు హతమైనట్లు సమాచారం. పాకిస్తాన్ ఆర్మీ కోసం పనిచేసిన ఇరానీ… మాజీ భారత నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ ని ఇరాన్ లోని చాబహర్ ఏరియాలో కిడ్నాప్ చేసి ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి అప్పగించిన విషయం తెలిసిందే.



అనేకమంది ఇరాన్ భద్రతాదళాలను కిడ్నాప్ చేయడం,చంపేయడం,ఇతర చట్టవిరుద్ద కార్యకాలపాలకు పాల్పడి ఇరాన్ ప్రభుత్వానికి వాంటెడ్ గా ఉన్న ముల్లా ఒమర్ ఇరానీ,అతని ఇద్దరు కుమారులు ఎదుకాల్పుల్లో హతమైనట్లు పాకిస్తాన్ కు చెందిన డాన్ న్యూస్ తెలిపింది. నిషేధిత ఇరానియన్ సంస్థ ‘జష్ ఉల్ అదల్’కి చెందిన చానాళ్ల క్రితమే ఇరాన్ ప్రభుత్వం ఈ వాంటెడ్ టెర్రరిస్ట్ ను పట్టుకోవడంలో పాకిస్తాన్ సాయం కోరినట్లు డాన్ న్యూస్ తెలిపింది. ఎట్టకేలకు మంగళవారం నిషేధిత ఇరానియన్ సంస్థ ‘జష్ ఉల్ అదల్’కి చెందిన ముల్లా ఒమర్ ఇరానీని ఎదురుకాల్పుల్లో పాక్ పోలీసులు హతమార్చినట్లు పేర్కొంది.



కాగా, ‘ముల్లా ఒమర్ ఇరానీ చేతిలో కిడ్నాప్ కు గురై పాకిస్తాన్ ఆర్మీకి అప్పగించబడ్డ మాజీ భారత నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ కి 2017 ఏప్రిల్ లో గూఢచర్యం,ఉగ్రవాదం ఆరోపణలతో పాకిస్తాన్ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇరాన్ లో వ్యాపారం పేరుతో తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ కులభూషణ్ ని బలూచిస్తాన్ లో అరెస్ట్ చేసినట్లు పాక్ చెప్తుండగా…భారత్ మాత్రం దీన్ని తప్పికొట్టింది.



ఇరాన్ లో-పాకిస్తాన్ బోర్డర్ లో అక్రమంగా కులభూషణ్ ని అరెస్ట్ చేశారని భారత్ పేర్కొంది. కొన్ని వారాల తర్వాత, కులభూషణ్ ని న్యాయసహాయాన్ని తిరస్కరించడాన్ని మరియు అతడి మరణశిక్షను సవాల్ చేస్తూ భారత్..హేగ్ లోని అంతర్జాతీయ కోర్టు(ICJ)ని ఆశ్రయించింది. అయితే కులభూషణ్ మరణశిక్షపై పాకిస్తాన్ పున సమీక్ష మరియు ప్రభావవంతమైన రివ్యూ చేపట్టాలని,అదేవిధంగా జాదవ్ కికి భారత్ తరపున న్యాయసహాయం వెంటనే అందేలా చూడాలని 2019 జులైలో ఐసీజే తీర్పునిచ్చింది.