Zombie Angelina Jolie: ‘జాంబీ ఏంజెలినా జోలీ’ అసలు రూపం ఇదే.. ఎట్టకేలకు రివీల్ చేసిన యువతి

‘జాంబీ ఏంజెలినా జోలీ’గా గుర్తింపు తెచ్చుకున్న ఇరాన్ యువతి తన అసలు ముఖాన్ని తాజాగా వెల్లడించింది. ఒక టీవీ ఛానెల్ ద్వారా తన ముఖాన్ని ప్రపంచానికి చూపించింది. ఆమె పేరు సహర్ తాబర్.

Zombie Angelina Jolie: ‘జాంబీ ఏంజెలినా జోలీ’ అసలు రూపం ఇదే.. ఎట్టకేలకు రివీల్ చేసిన యువతి

Zombie Angelina Jolie: ‘జాంబీ ఏంజెలినా జోలీ’.. సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్లలో చాలా మందికి తెలిసిన పేరు. హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలి రూపాన్ని పోలి ఉంటూ, బక్కచిక్కినట్లు, వింతగా కనిపిస్తుంది. దీంతో ఆమెను అందరూ ‘జాంబీ ఏంజెలినా జోలీ’ అంటారు. అయితే, ఇది ఆమె అసలు రూపం కాదు.

Fire Haircut: ప్రాణాల మీదకు తెచ్చిన ‘ఫైర్ హెయిర్ కట్’.. తల ఎలా కాలిందో చూడండి.. వీడియో వైరల్

ఆమె పేరు సహర్ తాబర్. ఇరాన్‌కు చెందిన సహర్ తాబర్ సోషల్ మీడియాలో ఏంజెలినా జోలీలా కనిపించేందుకు చాలా కారణాలున్నాయి. ఆమెకు ఏంజెలినా జోలీ అంటే చాలా ఇష్టం. దీంతో ఆమెలా కనిపించేందుకు ప్రయత్నించింది. దీని కోసం కొన్ని ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకుంది. ముఖం, పెదవులు, ముక్కు.. ఇలా అనేక చోట్ల సర్జరీ చేయించుకుంది. మొత్తం 50 వరకు సర్జరీలు చేయించుకున్నట్లు చెప్పింది. ఈ సర్జరీల కారణంగానే ఆమె ఏంజెలినా జోలీలా మారిందని, ఆమె చేసుకున్న సర్జరీలు విఫలమయ్యాయని అందరూ నమ్మేవాళ్లు. అందువల్లే తను వింత ఆకారంలో కనిపిస్తుందని చాలా మంది భావించారు. ఈ రూపం కారణంగా ఆమెకు విపరీతమైన పాపులారిటీ దక్కింది. అలాగే ప్లాస్టిక్ సర్జరీ విఫలమైతే ఎలా ఉంటుందో చెప్పేందుకు కూడా ఆమెను ఉదాహరణగా చూపించేవాళ్లు.

Rohit Sharma: యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. అత్యధిక సిక్సర్లతో కొత్త రికార్డు

ఏదైతేనేం ఆమె ఇంటర్నెట్‌లో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే, కఠిన చట్టాల్ని అమలు చేసే ఇరాన్‌లో ఆమె వ్యవహారశైలిపై విమర్శలు తలెత్తాయి. హిజాబ్ ధరించనందుకు, హిజాబ్‌ను, దైవ సంబంధిత విషయల్ని హేళన చేసినందుకు అక్కడి ప్రభుత్వం ఆమెపై కన్నెర్ర చేసింది. సహార్‌పై పలు కేసులు నమోదు చేసి 2019లో జైలు శిక్ష విధించింది. ఇటీవలే జైలు నుంచి విడుదలైంది. ఈ నేపథ్యంలో సహర్ తన అసలు ముఖాన్ని బయటపెట్టింది. ఒక ఇరాన్ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ తన నిజమైన ముఖాన్ని చూపించింది. కాగా, తను ఏంజెలినా జోలీలా కనిపించేందుకు ఏం చేసేదో వెల్లడించింది. తనకు తెలిసిన మేకప్ స్కిల్స్‌తోపాటు, కంప్యూటర్ స్కిల్స్ ఉపయోగించి తాను ఏంజెలినా జోలీలా కనిపించినట్లు వెల్లడించింది.