Bernadette Hagans : క్యాన్సర్ జయించి..కృత్రిమ కాలితో అందాల పోటీలకు..

ఒంటికాలితో విజయం సాధించినవారు ఎంతోమంది ఉన్నారు. కాలు లేకపోయినా చరిత్రను సృష్టించినవారు ఉన్నారు. అటువంటి ఓ అమ్మాయి అందాల పోటీలకు ఎంపికైంది. క్యాన్సర్ సోకి కాలు తీసివేసిన ఓ యువతి అందాల పోటీల్లో పాల్గొనటానికి ఎంపిక అయ్యింది బెర్నాడెట్ హగాన్స్. కృత్రిమ కాలుతో అందాల పోటీల వేదికపై ర్యాంప్ వాక్ చేయబోతోంది...తన చిన్ననాటి కలను సాకారం చేసుకునే దిశగా కృత్రిమ కాలుతో అడుగులు వేస్తోంది.

Bernadette Hagans : క్యాన్సర్ జయించి..కృత్రిమ కాలితో అందాల పోటీలకు..

Bernadette Hagans

Bernadette Hagans : క్యాన్సర్‌ మహ్మారి వచ్చిందంటే ఇక మరణే అనుకునేంత భయంకరమైన వ్యాధి అది. కానీ ధైర్యంతో క్యాన్సర్ జయించి జీవించేవారు కూడా చాలా మందే ఉన్నారు. క్యాన్సర్ వచ్చిందని ఇక జీవితమే లేదనుకుంటే ఎలా అంటూ అంతులేని ఆత్మవిశ్వాసంతో ఎన్నో విజయాలను అందుకుంటున్నారు ఎంతోమంది అతివలు. అటువంటి వారిలో ఐర్లాండ్ కు చెందిన బెర్నాడెట్ హగాన్స్ అనే యువతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

క్యాన్సర్ బారిన పడి కోలుకుని సాధారణ జీవితం గడిపేవారికి పూర్తిగా భిన్నం బెర్నాడెట్ హగాన్స్ పరిస్థితి. ఎందుకంటే ఆమెకు సోకిన కీళ్లకు సంబంధించిన క్యాన్సర్ వల్ల బెర్నాడెట్ హగాన్స్ తన కాలునే కోల్పోయింది. కానీ ఆమెలో ఆత్మవిశ్వాసం మాత్రం కోల్పోలేదు. కృత్రిమ కాలుతో తన కలను సాకారం చేసుకోవటానికి అడుగులు వేస్తోంది. కాలు లేకపోతే..ఏమైంది? నేను అనుకున్నది సాధిస్తాను..అందాల పోటీల్లో పాల్గొనాలని విజయం సాధించాలనే నా కలను సాకారం చేసుకుంటానంటోంది బెర్నాడెట్ హగాన్స్ తన కృత్రిమ కాలుతో. కృత్రిమ కాలుతోనే అందాల పోటీలకు సిద్ధమైంది.

చిన్న చిన్న కారణాలకే జీవితాలను నాశనం చేసుకునే ఎంతోమంది బెర్నాడెట్ హగాన్స్ చూసి స్ఫూర్తి పొందాల్సిందే..తన శరీరంలో ఉన్న లోపాన్ని తలచుకుని ఏమాత్రం కుమిలిపోకుండా అంతులేని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతోంది బెర్నాడెట్ హగాన్స్. తన కలను సాకారం చేసుకోవటానికి అడుగులు వేస్తోంది. ‘మిస్ వరల్డ్ ఐర్లాండ్ అందాల పోటీ‘లకు బెర్నాడెట్ ఎంపిక కావడం ఆమెలోని ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని చెప్పాలి. 23 ఏళ్ల వయసులో బెర్నాడెట్‌కు కీళ్ల క్యాన్సర్ సోకింది. దీంతో కుడికాలు తీసేయాల్సి వచ్చింది. ఒంటికాలితో ఉన్న కూతుర్ని చూసి ఆమె కుటుంబం కృంగిపోయింది. బెర్నాడెట్ కూడా చాలా బాధపడింది. కానీ అలాగే ఉంటే తన కాలు యథాస్థితికి వస్తుందా? అని ప్రశ్నించుకుంది. అలాగని జీవితం అయిపోయిందనుకోవాలా? అని పదే పదే ప్రశ్నించుకుంది. తనలో తానే స్ఫూర్తిని నింపుకుంది. అలా తాను కోలుకుంటూనే తన కుటుంబాన్ని కూడా ఆ బాధనుంచి కోలుకునేలా చేసింది.

మెల్లగా కృత్రిమ కాలుకు అలవాటు పడింది. కొత్తగా కృత్రిమ కాలుతో అడుగులు వేయటం నేర్చుకుంది. చాలా బాధగా ఉండేది.కానీ తప్పదు..భరించాలి. అలా బాధను లెక్క చేయండా అడుగులు వేయటం అలవాటు చేసుకుంది. అలా ఆమె ‘కృత్రిమ కాలుతోనే ర్యాంప్ వాక్’ చేయబోతోంది అందాల పోటీల వేదికపై. అందాల పోటీల్లో పాల్గొనటానికి ఎంపిక కావటంతో ఆమెకు ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగింది. ఆమె కుటుంబానికి కలిగిన సంతోషం ఇంతా అంతా కాదు.

అందాల పోటీల్లో పాల్గొనాలని విజేతగా నిలవాలని బెర్నాడెట్ హగాన్స్ చిన్నప్పటినుంచి కల. ఆమె కోరికను అర్థం చేసుకున్న కుటుంబ ప్రోత్సహించింది. అలాగే ఆమె అభిలాషను గుర్తించిన జెబెడీ మేనేజ్‌మెంట్ అనే వికలాంగుల సేవా సంస్థ బెర్నాడెట్ హగాన్స్ కు అవసరమైన సహాయాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. ఆమె కలల ఫలించానికి తమ వంతు సహకారాన్ని ఇచ్చి అండగా నిలిచింది. ఇప్పుడు మిస్ వరల్డ్ ఐర్లాండ్ పోటీల ఫైనలిస్టు జాబితాలో చోటు సంపాదించింది బెర్నాడెట్ హగాన్స్. వచ్చే సెప్టెంబర్‌లో జరిగే ఫైనల్ పోటీలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా బెర్నాడెట్ హగాన్స్ తన సోషల్ మీడియా లో ఈ విషయాన్ని తెలిపింది. కృత్రిమ కాలితో ర్యాంప్ వాక్ చేయబోతున్న మొట్టమొదటి మోడల్‌గా బెర్నాడెట్ చరిత్ర సృష్టించబోతోంది ఐర్లాండ్ బ్యూటీ బెర్నాడెట్ హగాన్స్.