China vs America : రెండు అగ్రరాజ్యాల మధ్య యుద్ధం జరగబోతోందా? తైవాన్‌ను అడ్డుపెట్టుకొని చైనాను అమెరికా రెచ్చగొడుతుందా?

రెండు అగ్ర రాజ్యాల మధ్య యుద్ధం జరగబోతోందా..? తైవాన్‌ను అడ్డుపెట్టుకొని చైనాను అమెరికా రెచ్చగొడుతుందా..? తైవాన్‌ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకొవడానికి మరోసారి అగ్రరాజ్యం కారణమయ్యింది. చైనా వద్దంటున్నా.. తైవాన్‌కు అమెరికా సాయం చేస్తుండడంతో ఏ నిమిషం ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.

China vs America : రెండు అగ్రరాజ్యాల మధ్య యుద్ధం జరగబోతోందా? తైవాన్‌ను అడ్డుపెట్టుకొని చైనాను అమెరికా రెచ్చగొడుతుందా?

China vs America

China vs America : రెండు అగ్ర రాజ్యాల మధ్య యుద్ధం జరగబోతోందా..? తైవాన్‌ను అడ్డుపెట్టుకొని చైనాను అమెరికా రెచ్చగొడుతుందా..? తైవాన్‌ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకొవడానికి మరోసారి అగ్రరాజ్యం కారణమయ్యింది. చైనా వద్దంటున్నా.. తైవాన్‌కు అమెరికా సాయం చేస్తుండడంతో ఏ నిమిషం ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. తైవాన్‌కు మద్దతు విషయంలో అమెరికా మరో అడుగు ముందుకేసింది. చైనా దూకుడుతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న వేళ.. తైవాన్‌ దేశ రక్షణ వ్యవస్థ బలోపేతానికి తాజాగా 1.1 బిలియన్‌ డాలర్ల ఆయుధాల ప్యాకేజీని ప్రకటించి సంచలనం సృష్టించింది.

శత్రుదేశాల క్షిపణుల ట్రాకింగ్‌ కోసం 665 మిలియన్‌ డాలర్ల విలువైన ముందస్తు రాడార్ హెచ్చరిక వ్యవస్థ, 355 మిలియన్‌ డాలర్ల విలువైన 60 అధునాతన హార్పూన్ యాంటీ షిప్‌ క్షిపణులతోపాటు 100 ఎయిర్‌ టు ఎయిర్‌ సైడ్‌విండర్‌ క్షిపణుల విక్రయాలు ఈ ప్యాకేజీలో ఉండడంతో చైనాకు ఒళ్లు మండిపోతోంది. తైవాన్‌పై చైనా ఏ క్షణమైనా దాడికి దిగొచ్చన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే అమెరికా ఆర్థిక సాయం ప్రకటించడం కాక రేపుతోంది.

China-Taiwan conflict: తైవాన్‌కు రూ.8,768 కోట్ల ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా నిర్ణయం.. చర్యలు తప్పవని చైనా వార్నింగ్

అమెరికా చర్యలు తమను రెచ్చగొట్టేలా ఉన్నాయంటోంది చైనా. అటు ఇటీవల చైనాకు గట్టిగా బదులిస్తోంది తైవాన్‌. డ్రాగన్‌తో ఢీ అంటే ఢీ అంటోంది. మొన్నటికి మొన్న షియూ ఐలాండ్‌లోకి చొచ్చుకొచ్చిన సివిలియన్‌ డ్రోన్‌ను పడగొట్టింది తైవాన్‌. చైనీస్‌ కోస్ట్‌ నుంచి పరిధి దాటి వచ్చిన డ్రోన్‌ను పసిగట్టిన తైవాన్‌ మిలిటరీ వెంటనే అప్రమత్తమైంది. డ్రోన్‌పై ఫోకస్‌ పెట్టిన మిలిటరీ.. నేలకూల్చింది. దీనిని గుర్తు తెలియని డ్రోన్‌గా తైవాన్‌ చెబుతోంది. చైనా వైపు నుంచే రావడంతో డ్రాగన్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

ఇది జరిగి నాలుగు రోజులకు కూడా కాకుండానే తైవాన్‌కు అమెరికా సాయం అందించడంతో చైనాకు చికాకు పెరిగింది. దీంతో తైవాన్‌పై ఏ క్షణమైన విరుచుకుపడే ఛాన్స్‌ ఉందన్న ప్రచారం మొదలైంది. ఒకవేళ అదే నిజమైతే మరో యుద్ధాన్ని ప్రపంచం చూడక తప్పదు..! ఇప్పటికే యుక్రెయిన్‌-రష్యా యుద్ధ ప్రభావం ప్రపంచమంతా పడగా.. ఇప్పుడు తైవాన్‌-చైనా యుద్ధం జరిగితే మరో వినాశనం చవిచూడక తప్పదన్న భయాలు సర్వత్రా నెలకొన్నాయి.