ISIS: భారత లీడర్‭ను హతమార్చేందుకు ఐసిస్ ప్లాన్.. భగ్నం చేసి, ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన రష్యా

సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తూ తమ ఐడియాలజీని విస్తృతం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా సానుభూతి పరులను తయారు చేసే పనిలో ఐసిస్ ఉందని, అయితే దేశంలో ఐసిస్ కార్యకలాపాలన్నింటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ యువత అటువైపు దారిమళ్లకుండా ప్రభుత్వ ఏజెన్సీలు, సైబర్ స్పేస్ పని చేస్తున్నాయని కేంద్ర హోమంత్రిత్వ శాఖ ఒక సందర్భంలో తెలిపింది.

ISIS: భారత లీడర్‭ను హతమార్చేందుకు ఐసిస్ ప్లాన్.. భగ్నం చేసి, ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన రష్యా

ISIS Bomber Planned Attack On Indian Leader Detained In Russia

ISIS: భారత ఉన్నత నాయకుడిపై బాంబ్ అటాక్‭కు చేసిన ప్లాన్‭ను భగ్నం చేయడమే కాకుండా, ఈ దాడికి యత్నించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) చెందిన ఉగ్రవాదిని ది రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్‭బీ) అరెస్ట్ చేసినట్లు రష్యాకు చెందిన స్పూత్నిక్ అనే మీడియా సంస్థ సోమవారం తెలిపింది. అరెస్టైన ఐసిస్ ఉగ్రవాది టర్కీలో శిక్షణ పొందినట్లు విచారణలో వెల్లడించాడని ఎఫ్ఎస్‭బీ పేర్కొంది.

‘‘రష్యాలో నిషేధించబడ్డ ఇస్లామిక్ స్టేట్ ఇంటర్నేషనల్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక సభ్యుడిని రష్యాకు చెందిన ఎఫ్ఎస్‭బీ అరెస్ట్ చేసింది. అతడిది మధ్య ఆసియాలోని ఒక దేశం. అతడు మానవబాంబు పేల్చుకుని ఇండియాకు చెందిన ఉన్నత నాయకుడిపై దాడి చేయడానికి ప్లాన్ వేసుకున్నాడు. ఈ ప్లాన్‭ను ఎఫ్ఎస్‭బీ భగ్నం చేసింది’’ అని రష్యా ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఐసిస్‭ అన్ని కార్యకలాపాలను ఉగ్రవాద చర్యలుగా పేర్కొంటూ దేశంలో ఐసిస్‭ను భారత ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967 కింద ఈ సంస్థను రద్దు చేస్తున్నట్లు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా, సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తూ తమ ఐడియాలజీని విస్తృతం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా సానుభూతి పరులను తయారు చేసే పనిలో ఐసిస్ ఉందని, అయితే దేశంలో ఐసిస్ కార్యకలాపాలన్నింటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ యువత అటువైపు దారిమళ్లకుండా ప్రభుత్వ ఏజెన్సీలు, సైబర్ స్పేస్ పని చేస్తున్నాయని కేంద్ర హోమంత్రిత్వ శాఖ ఒక సందర్భంలో తెలిపింది.

Satya Pal Malik on MSP: ప్రధాని మోదీపై మరోసారి విరుచుకుపడ్డ మేఘాలయ గవర్నర్