Bill Gates : బిల్ గేట్స్‌కు కరోనా పాజిటివ్.. అప్పటివరకూ ఐసోలేషన్‌లోనే ఉంటా..!

Bill Gates : మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనలో కరోనా తేలికపాటి లక్షణాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

Bill Gates : బిల్ గేట్స్‌కు కరోనా పాజిటివ్.. అప్పటివరకూ ఐసోలేషన్‌లోనే ఉంటా..!

Isolating Until I'm Healthy Again Bill Gates Tests Covid Positive

Bill Gates : మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనలో కరోనా తేలికపాటి లక్షణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. తాను పూర్తిగా కరోనా నుంచి కోలుకునేంతవరకు ఐసోలేట్ అవుతానని చెప్పారు. కరోనా పరిస్థితుల్లో టీకాలు వేయించడం, బూస్టర్ డోసులు, కొవిడ్ టెస్టులు చేయించుకునే వెసులుబాటుతో పాటు మంచి వైద్యులు అందుబాటులో ఉండటం తన అదృష్టమని గేట్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

కరోనా మళ్లీ విజృంభిస్తున్న సమయంలో బిల్ గేట్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీటెల్‌కు చెందిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రైవేట్ ఫౌండేషన్ గా పేరొంది. ఎండోమెంట్ సుమారు 65 బిలియన్లు డాలర్లుగా ఉంటుంది.

Isolating Until I'm Healthy Again Bill Gates Tests Covid Positive (1)

Isolating Until I’m Healthy Again Bill Gates Tests Covid Positive 

బిల్ గేట్స్ కరోనా నిర్మూలనలో ముఖ్యంగా పేద దేశాలకు వ్యాక్సిన్‌లు, మందులు అందేలా ఎంతో కృషి చేశారు. అక్టోబరులో గేట్స్ ఫౌండేషన్ తక్కువ-ఆదాయ దేశాల కోసం.. డ్రగ్‌మేకర్ మెర్క్ యాంటీవైరల్ COVID-19 పిల్ జెనరిక్ వెర్షన్‌లకు యాక్సెస్‌ను పెంచడానికి 120 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొంది.

గతంలో బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్లపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా టీకా ఫార్ములాను పంచుకోవద్దని సూచించారు. భారత్ సహా పలు అభివృద్ధి చెందుతున్న దేశాలనుద్దేశించి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ, పేటెంట్లకు సంబంధించి బిల్ గేట్స్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.

Read Also : Bill Gates: “కొత్త కొవిడ్ వేరియంట్ చాలా డేంజరస్.. అన్నీ ఆపేయాలంతే”