Israel-Gaza : ఇజ్రాయెల్-గాజా: గూగుల్ మ్యాప్స్‌లో ఈ ప్రాంతం ఎందుకు బ్లర్‌గా ఉందంటే?

ఇజ్రాయెల్-పాలస్తీనా హమాస్ ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో విధ్వంసానికి దిగుతుండగా.. ఇజ్రాయెల్ దళాలు దీటుగా రాకెట్లను ఎదుర్కొంటున్నాయి.

Israel-Gaza : ఇజ్రాయెల్-గాజా: గూగుల్ మ్యాప్స్‌లో ఈ ప్రాంతం ఎందుకు బ్లర్‌గా ఉందంటే?

Israel Gaza Why Is The Region Blurry On Google Maps

Israel-Gaza region blurry on Google Maps : ఇజ్రాయెల్-పాలస్తీనా హమాస్ ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో విధ్వంసానికి దిగుతుండగా.. ఇజ్రాయెల్ దళాలు దీటుగా రాకెట్లను ఎదుర్కొంటున్నాయి. ఇజ్రాయెల్-పాలస్తీనా ఉద్రిక్తతలపై ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్ లో ఒక ప్రాంతమంతా బ్లర్‌గా కనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత గల ప్రాంతాల్లో ఒకటైన గాజా గూగుల్ మ్యాప్స్‌లో ఎందుకు అస్పష్టంగా ఉందంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రవాదులు గూగుల్ మ్యాప్స్ డేటా ద్వారా దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఉద్దేశంతో ఆయా ప్రాంతాలను బ్లర్ చేశారు.

ఇజ్రాయెల్, పాలస్తీనా భూభాగాల నుంచి అధిక రిజల్యూషన్ శాటిలైట్ ఫొటోలను లభించవని ఓపెన్ సోర్స్ పరిశోధకులు అంటున్నారు. వాస్తవానికి, శాటిలైట్ సంస్థల నుంచి అధిక-నాణ్యత ఫొటోలు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇజ్రాయెల్, పాలస్తీనా భూభాగాలు చాలావరకు గూగుల్ ఎర్త్‌లో తక్కువ-రిజల్యూషన్ శాటిలైట్ ఫొటోలుగా కనిపిస్తాయి.

అధిక రిజల్యూషన్ ఫొటోలు అందుబాటులో ఉన్నాయా? అంటే.. గత ఏడాది వరకు, ఇజ్రాయెల్, పాలస్తీనా భూభాగాల శాటిలైట్ ఫొటోలు రెజుల్యుషన్‌పై అమెరికా ప్రభుత్వం ఒక పరిమితిని విధించింది. వాణిజ్య ప్రాతిపదికన అందించడానికి అమెరికన్ కంపెనీలకు అనుమతినిచ్చింది. ఇజ్రాయెల్ భద్రతా సమస్యలకు మద్దతుగా కైల్-బింగామన్ సవరణ (KBA)-1997 నాటి యుఎస్ చట్టంలో ఈ పరిమితిని చేర్చారు. సైనిక స్థావరాల సైట్లు అస్పష్టంగా ఉంటాయి.

ఈ చట్టంలో ఇజ్రాయెల్ గురించి మాత్రమే ప్రస్తావించగా.. పాలస్తీనా భూభాగాలకు కూడా వర్తింపజేశారు. జూలై 2020లో KBA తొలగించారు. ఇప్పుడు US ప్రభుత్వం అమెరికన్ కంపెనీలకు ఈ ప్రాంతం హై-రెజుల్యుషన్ ఫొటోలను అందించడానికి అనుమతిస్తుంది. గాజా ఇంకా అస్పష్టంగా ఎందుకు ఉందంటే.. ఆపిల్ తన మ్యాప్‌లను త్వరలో 40 సెం.మీ అధిక రిజల్యూషన్‌కు అప్‌డేట్ చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపింది. గూగుల్ ఫొటోలు అనేక రకాల ప్రొవైడర్ల నుండి వచ్చాయని అధిక-రిజల్యూషన్ ఇమేజరీ అందుబాటులోకి వచ్చినప్పుడు శాటిలైట్ ఫొటోలను అప్‌డేట్ చేసే అవకాశం ఉంది.