Omicron Death : ఒమిక్రాన్‌ మరణం ఎఫెక్ట్.. 2 సరిపోవు.. 4 డోసులు తప్పదంటున్న ఇజ్రాయిల్

ఇజ్రాయిల్ లో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదు కావటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ వ్యాక్సిన్ నాలుగవ డోసు వేసే యత్నాలు చేపట్టింది.

Omicron Death : ఒమిక్రాన్‌ మరణం ఎఫెక్ట్.. 2 సరిపోవు.. 4 డోసులు తప్పదంటున్న ఇజ్రాయిల్

Israel 1st Omicron Death..4th Dose

Death of Omicron in Israel..4th dose attempts : కరోనా  కొత్త వేరియంట్ ఒమిక్రాన్ జెడ్ స్పీడతో ప్రపంచ దేశాలకు పాకిపోయింది. ఇప్పటికే ఒమిక్రాన్ తో అమెరికాలో ఒకరు. ఇజ్రాయెల్ లో ఒకరు చనిపోయారు.దీంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. దీంతో ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోనివారు వేయించుకోవాలని…రెండు డోసులు వేయించుకున్నవారు సైతం బూస్టర్ డోసులు వేయించుకోవాలని సూచిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. బీర్షెబా నగరంలో కొత్త వేరియంట్‌ కారణంగా ఓ 60 ఏళ్ల వ్యక్తి మృతిచెందటంతో ప్రభుత్వం ఒమిక్రాన్ కు చెక్ పెట్టేలా కసరత్తులు చేస్తోంది. దీంట్లో భాగంగా..నాలుగో డోసు కూడా వేయించుకోవాలని చెబుతోంది.అనటమే కాదు నాలుగో డోసు ఇవ్వటానికి కసరత్తులు చేస్తోంది.

Read more : Omicron Death : ఇజ్రాయెల్‌లో తొలి ఒమిక్రాన్ మరణం

నాలుగవ డోసు తప్పదంటున్న ఇజ్రాయోల్..
ఒమిక్రాన్‌ వ్యాప్తి..ఇజ్రాయెల్ లో ఒక మరణం నమోదు కావటంతో మరో బూస్టర్‌ డోసు పంపిణీ కోసం ఇజ్రాయెల్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. ఒమిక్రాన్ తో చనిపోయిన వ్యక్తి 60 ఏళ్లు కావటంతో..ప్రభుత్వం వద్ధుల ప్రాణాల్ని రక్షించటానికి మరో డోసు అందించడానిక యత్నిస్తోంది. 60ఏళ్లు పైబడినబారికి నాలుగో డోసు ఇవ్వాలని ఇజ్రాయెల్ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.

Read more : Omicron Death : అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం

దీనిపై ప్రధాని నఫ్తాలి బెన్నెట్‌ సానుకూలంగా స్పందిస్తు..‘‘ఒమిక్రాన్‌ నుంచి బయటపడేందుకు ఇదే సరైన మార్గమని మేం నమ్ముతున్నామని కాబట్టి ప్రభుత్వ సూచనల మేరకు అర్హత కలిగినవారు మరోసారి వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. అర్హులైన వారంతా సమయం వృథా చేసుకోకుండా..నిర్లక్ష్యం చేయకుండా నాలుగవ డోసు కూడా వేయించుకోవాలని ప్రధాని ప్రజల్ని కోరారు. దీనిపై దేశ ఆరోగ్యశాఖ నుంచి ఇంకా అధికారిక అనుమతులు రావాల్సి ఉంది. అనుమతులు వచ్చిన వెంటనే.. 60ఏళ్లు పైబడిన వారికి నాలుగవ డోసు పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు దాదాపు 350 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంట్లో భాగంగా అమెరికా సహా జర్మనీ, ఇటలీ, టర్కీ, కెనడా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించింది.

Read more : Omicron Variant: డబుల్ సెంచరీకి మించి ఒమిక్రాన్ కేసులు.. మూడోస్థానంలో తెలంగాణ

కాగా ఇజ్రాయెల్ లో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి కొద్ది రోజుల క్రితం కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో పరీక్షలు నిర్వహించగా.. ఒమిక్రాన్‌ బారినపడినట్లు నిర్ధారించారు నిపుణులు.అనంతరం చికిత్స చేపట్టారు. కానీ గత మంగళవారం అతనుచనిపోయారు.