11-Day War : ఇజ్రాయెల్ – హమాస్ కాల్పుల విరమణ

గత 11 రోజులుగా కొనసాగుతున్న హింసకు తెరపడింది. ఇజ్రాయెల్ దాడితో పాలస్తీనియున్లు గజగజ వణికిపోయిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కాల్పులు జరిగాయి. ఈ హింసలో 200 మందికి పైగా పాలస్తీనియున్లు ప్రాణాలు కోల్పోయారు.

11-Day War : ఇజ్రాయెల్ – హమాస్ కాల్పుల విరమణ

Israel, Hamas

Israel, Hamas : గత 11 రోజులుగా కొనసాగుతున్న హింసకు తెరపడింది. ఇజ్రాయెల్ దాడితో పాలస్తీనియున్లు గజగజ వణికిపోయిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కాల్పులు జరిగాయి. ఈ హింసలో 200 మందికి పైగా పాలస్తీనియున్లు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయల్ పై భారీగా రాకెట్లను ప్రయోగించింది. గాజాను లక్ష్యంగా చేసుకుని వాయు దాడులకు దిగింది.

కాల్పులకు తెరదించాలని పలు జాతీయ దేశాలు ఇజ్రాయెల్ కు సూచించాయి. మిత్రదేశమైన అమెరికా నుంచి కూడా భారీ వత్తిడి పెరిగింది. దీంతో ఇజ్రాయెల్ ఓ మెట్టు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఒకే చెప్పింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి 2021, మే 20వ తేదీ గురువారం ఇజ్రాయెల్ మంత్రి వర్గం ఆమోదించింది. ఫలితంగా 11 రోజుల కాల్పులకు తెరపడినట్లైంది. అయితే..ఇజ్రాయెల్ దాడితో చాలా మంది పాలస్తీనియన్లు గాజాను విడిచిపెట్టి వెళ్లిపోయారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు.

ఇజ్రాయెల్ పౌరుల శాంతిభద్రతల పరిరక్షణ జరిగేవరకు తమ దాడులు కొనసాగుతాయని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణకు, ఘర్షణల తీవ్రత తగ్గుతుందని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వెల్లడించారు.

Read More : V Jayaram : కరోనాతో సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత..