Israel Hit By Rockets : ఇజ్రాయెల్ పై రాకెట్ల దాడి

జ్రాయెల్ పై రాకెట్ దాడులు జరిగాయి.

Israel Hit By Rockets : ఇజ్రాయెల్ పై రాకెట్ల దాడి

Israel

Israel Hit By Rockets ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులు జరిగాయి. బుధవారం మధ్యాహ్నాం.. తమ దేశంపై దాడిలో భాగంగా మూడు రాకెట్లను లెబనాన్ ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఒక రాకెట్ లెబనాన్ భూభాగంలోనే పేలిందని,మరో రెండు రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగంలో పేలినట్లు ఇజ్రాయెల్ రక్షణశాఖ తెలిపింది. లెబనాన్‌లో ఉన్న పాలస్తీనా గ్రూపులు ఈ రాకెట్ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అనుమాస్తోంది. లెబనాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న కిర్యాత్ స్మోనా పట్టణంతో సహా అనేక ఇజ్రాయెల్ కమ్యూనిటీలలో రాకెట్ దాడి హెచ్చరిక సైరన్లు వినిపించాయి.

అయితే ఈ రాకెట్ల దాడి ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. లెబనాన్ దాడికి ప్రతిదాడిగా తాము లెబనాన్ భూభాంగపైకి ఫిరంగులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. సరిహద్దు వద్ద శాంతియుత పరిస్థితులు లేకుంటే, తమ ప్రతిచర్యను మరింత తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్.. లెబనాన్‌ను UN దళాల ద్వారా హెచ్చరించింది.

కాగా, దక్షిణ లెబనాన్‌ను నియంత్రించే మరియు అధునాతన మిసైల్స్ కలిగి ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాదులపై 2006లో ఇజ్రాయెల్ యుద్ధం చేసినప్పటినుంచి సరిహద్దు ప్రాంతం(ఇజ్రాయెల్-లెబనాన్) దాదాపు ప్రశాంతంగా ఉంది. కానీ, లెబనాన్ లోని కొన్ని పాలస్తీనా వర్గాలు గతంలో పలుసార్లు ఇజ్రాయెల్ వైపు రాకెట్లను ఎక్కుపెట్టాయి. జూలై 20 న కూడా ఇజ్రాయెల్ మీద రెండు రాకెట్ దాడులు జరిగాయి. అయితే ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం జరగలేదు.