Israel : వేగంగా వ్యాక్సినేషన్ పంపిణీ..ఆ దేశాల్లో కరోనా తగ్గుముఖం..ఇజ్రాయెల్ ముందు చూపు

కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ జోరందుకొంటోంది. కొన్ని దేశాల్లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ జరుగుతోంది. దీంతో ఇజ్రాయెల్, యూకే వంటి దేశాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

Israel : వేగంగా వ్యాక్సినేషన్ పంపిణీ..ఆ దేశాల్లో కరోనా తగ్గుముఖం..ఇజ్రాయెల్ ముందు చూపు

herd immunity

Herd Immunity : కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ జోరందుకొంటోంది. కొన్ని దేశాల్లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ జరుగుతోంది. దీంతో ఇజ్రాయెల్, యూకే వంటి దేశాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఇజ్రాయెల్ లో జనవరి 20వ తేదీన 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ దేశ జనాభ 90 లక్షలు. వీరిలో 8.30 లక్షల మందికి గతంలోనే కొవిడ్ సోకడంతో యాంటీబాడీలు లభించాయి. వ్యాక్సినేషన్ మొదలైన ప్రారంభంలో కేసుల సంఖ్య తీవ్రత అధికమయ్యింది. దీంతో ఈ దేశం అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్ వేగవంతం చేసింది.

ఏప్రిల్ 12వ తేదీ నాటికి దాదాపు 60 శాతం మందికిపై వ్యాక్సినేషన్ డోస్ అందుకున్నారు. దాదాపు 53 లక్షల మందికి టీకాలు వేశారు. కొవిడ్ హెర్డ్ ఇమ్యూనిటీకి 70 శాతం మందిలో యాంటీబాడీలు ఉంటే..చాలన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ హెర్డ్ ఇమ్యూనిటీకి దగ్గరగా ఉంది. ఫలితంగా ఏప్రిల్ 13 నాటికి అక్కడి రోజు వారీ కేసు సంఖ్య 200 లోపునకు పడిపోయాయి. డిసెంబర్ 19వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. జనవరి 19వ తేదీ నాటికి అమెరికా ప్రజలు వ్యాక్సినేషన్ తీసుకోవడానికి వెనుకాముందు అయ్యారు. ఇజ్రాయెల్ మాత్రం 25 శఆతం ప్రజలకు ఓ డోసు టీకా వేసింది. మరో ఐదు లక్షల మందికి రెండో డోసులు కంప్లీట్ చేసింది. 2020 జూన్ లోనే మోడెర్నా నుంచి టీకా కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. అదే ఏడాది నవంబర్ లో ఆస్ట్రాజెనెకా, ఫైజర్లతో కూడా ఒప్పందం చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాన విమనాశ్రయం వద్ద భూగర్భంలో 50 లక్షల డోసుల నిల్వ సామర్థ్యం ఉన్న 30 భారీ రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేసింది.

ఇక అమెరికా విషయానికి వస్తే..వ్యాక్సినేషన్ జరిగే కొద్ది కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టాయి. జనవరి 08వ తేదీన 3 లక్షలకు పైగా కేసులు నమోదైన ఈ దేశంలో ఏప్రిల్ 13వ తేదీ నాటికి రోజువారీ కేసుల సంఖ్య 77 వేలకు తగ్గింది. గత సంవత్సరం నవంబర్ రెండో వారం నుంచి జనవరి చివరి వరకు దాదాపు నిత్యం 1.50 లక్షల కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 12వ తేదీ నాటికి 36 శాతం టీకాలు వేయించుకున్నారు.

భారత్ లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఏప్రిల్ 12వ తేదీ నాటికి టీకాలు పొందిన వారు 6.89 శాతంగా ఉంది. హెర్డ్ ఇమ్యూనిటీ లక్ష్యానికి చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని నిపుణులు వెల్లడించారు. మోడెర్నా, ఫైజర్ వంటి సంస్థలు అత్యంత వేగంగా ప్రయోగాలు మొదలపెట్టాయి. ఆక్స్ పర్డ్ విశ్వవిద్యాలయంలోని జెన్నర్ ఇనిస్టిట్యూట్ టీకా ప్రయోగాలు చేపట్టింది. చైనాలో ప్రయోగాలు అత్యంత రహస్యంగా సాగాయి. భారత్ లో భారత్ బయోటెక్ సంస్థ శరవేగంగా ప్రయోగాలను చేపట్టింది. చైనా, రష్యా దేశాలు అనధికారికంగా వ్యాక్సినేషన్ ను మొదలుపెట్టాయి.

వ్యాక్సినేషన్ ను ట్రాక్ చేస్తున్న అవర్ వరల్డ్ ఇన్ డేటా ఏప్రిల్ 12వ తేదీ నాటికి పది లక్షల జనాభా కంటే ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇజ్రాయెల్ అత్యధికంగా ప్రతి 100కి 118 డోస్ లను ఇచ్చింది. 91 డోస్ లతో యూఏీ, 63 డోసులతో చిలీ, 59 డోసులతో బహ్రెయిన్, 55 డోసులతో అమెరికా, 42 డోసులతో సెర్బియా, 42 డోసులతో హంగేరీ, 37 డోసులతో ఖతార్, 29 డోసులతో ఉరుగ్వేలు టాప్ టెన్ లో ఉన్నాయి.

Read More : CM Uddhav Thackeray : 15 రోజులు కర్ఫ్యూ, 144 సెక్షన్..భోజనం ఫ్రీ, పేదలకు, ఆదివాసీలకు రూ. 2వేల ఆర్థిక సాయం