Israel : ఇజ్రాయిల్ సైనికులు కంటికి కనబడరు, టెక్నాలజీకి దొరకరు

ఇజ్రాయిల్ సైనికులు కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. శత్రువులు, టెక్నాలజీకి దొరక్కుండా ఉండేందుకు కొత్త రకమైన పరికరాన్ని ఉపయోగించబోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే..ఊసరవెల్లిలా మారిపోనున్నారు. మనిషి కంటికి, టెక్నాలజీకి కూడా వీరు కనిపించరు. అలాంటి అత్యాధునికమైన టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు. ఇందుకు ఓ కిట్ ను రూపొందించింది.

Israel : ఇజ్రాయిల్ సైనికులు కంటికి కనబడరు, టెక్నాలజీకి దొరకరు

Israel

Soldiers Virtually Invisible : ఇజ్రాయిల్ సైనికులు కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. శత్రువులు, టెక్నాలజీకి దొరక్కుండా ఉండేందుకు కొత్త రకమైన పరికరాన్ని ఉపయోగించబోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే..ఊసరవెల్లిలా మారిపోనున్నారు. మనిషి కంటికి, టెక్నాలజీకి కూడా వీరు కనిపించరు. అలాంటి అత్యాధునికమైన టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు. ఇందుకు ఓ కిట్ ను రూపొందించింది. మైక్రో పైబర్స్, లోహాలు, పాలిమర్ లను కలిపి thermal visual concealment కిట్ ను రూపొందించారు.

ఈ షీట్ సుమారు 500 గ్రాముల బరువు ఉంటుంది. ఒక బండిల్ గా మడొవచ్చని Janes.com తెలిపింది. దీనిని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ పరీక్షించింది. Polaris Solutions co-founder Assaf Picciotto ఆలోచనల నుంచి ఆవిర్భవించిందని Ynet తెలిపారు. దీనిని ధరించిన సైనికుడు ఆ ప్రాంతంలో ఉన్న వాటికి మారిపోతాడు. అక్కడ సైనికుడు ఉన్నాడన్న విషయం ఇతరులకు కనీసం తెలియదు. బైనాక్యులర్, ఇతర టెక్నాలజీని ఉపయోగించినా..సైనికులు కనిపించరు. ఇజ్రాయిల్ రక్షణ మంత్రిత్వ శాఖ (Israeli Ministry of Defense (MoD))…సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించిందని తెలుస్తోంది. సైనికులను వాస్తవంగా అదృశ్యం చేస్తుందని జెరూసలెం పోస్టు నివేదించింది.

తేలికపాటిగా ఉండే విధంగా ఈ కిట్ ను రూపొందించారు. వీరిని గుర్తించడం కష్టతరమని Polaris Solutions website వెల్లడించింది. ఈ కిట్ ధరించిన తర్వాత ఆటోమెటిక్ గా వారు ప్రకృతిపరంగా మారిపోతారు. రాళ్లు ఎలా ఉంటాయో అలా..ఎడారిలో ఉంటే..దానికి అనుగుణంగా మారిపోతారు. దూరం నుంచి బైనాక్యులర్ లతో చూసినా..సైనికులను గుర్తుపట్టలేరని Gal Harari (head of the detectors and imaging technology branch) వెల్లడించారు.

2006 లెబనాన్ యుద్ధంలో ప్రత్యేక ఐడీఎఫ్ యూనిట్ లో పనిచేస్తున్న సమయంలో సైనికులు శత్రువుల నుంచి రక్షించుకోలేక పోయారని, శ్రతువు కంటే మెరుగ్గా ఉండాలని అర్థం చేసుకోవడం జరిగిందని Picciotto తెలిపారు. ఉత్తర అమెరికాకు తీసుకరావడానికి కెనాడా, అమెరికా ప్రత్యేక దళాల విభాగాలతో Polaris Solutions పనిచేస్తోందని తెలుస్తోంది.