ఇరాన్‌‌ సీక్రెట్ ఆపరేషన్‌లో అల్ ఖైదా నెం.2 ఉగ్రవాది హతం..!

  • Published By: sreehari ,Published On : November 14, 2020 / 06:46 PM IST
ఇరాన్‌‌ సీక్రెట్ ఆపరేషన్‌లో అల్ ఖైదా నెం.2 ఉగ్రవాది హతం..!

al Qaeda’s No. 2 leader  Abu Muhammad al-Masri: ఉగ్రవాది అల్ ఖైదా నెంబర్ 2 నేత హతమయ్యాడు. ఇరాన్‌లో గత అగస్టులో అల్ ఖైదా ఉగ్రవాది నేతను ఇజ్రాయెల్ సైనికులు హతమార్చినట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. 1998లో అఫ్రికాలో రెండు అమెరికా రాయబార కార్యాలయాలపై బాంబు దాడిలో కీలక సూత్రాధారిగా ఆరోపణలు ఉన్నాయి.



ఇతనిపై 10 మిలియన్ల రివార్డు కూడా ఉంది. అమెరికా ఆదేశాల ప్రకారమే.. ఆగస్టు నెలలో ఇజ్రాయెల్ దళాలు ఆల్ ఖైదా గ్రూపులో రెండో కీలక వ్యక్తిగా అబ్దుల్లా అహ్మద్‌ అబ్దుల్లా అలియాస్‌ అబు ముహమ్మద్‌ అల్‌-మస్రీని టెహ్రాన్‌ వీధుల్లో ఇజ్రాయెల్ సైన్యం హతమార్చారనే నిఘా వర్గాల సమాచారం ఉందని నివేదిక పేర్కొంది.



ఆగస్టు 7వ తేదీన టెహ్రాన్ వీధుల్లో మోటార్ సైకిల్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు తుపాకులతో కాల్చి చంపారని తెలిపింది. అల్ ఖైదా నెం.2 నేత హతమైనట్టు వచ్చిన వార్తలపై ఇరాన్‌ ప్రభుత్వం, అమెరికా ఎవరూ స్పందించలేదు.

అల్‌ ఖైదా సైతం ఎలాంటి ప్రకటన చేయలేదు. అల్ ఖైదా ప్రస్తుత నేత అయ్మాన్ అల్ జవ్హారి ఇప్పటివరకూ మస్రీని ఇప్పటివరకూ రహాస్యంగా ఉంచినట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదిక వెల్లడించింది.



మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఒకడైన మస్రీని యూఎస్ ఫెడరల్ బ్యూరో ఎప్పటినుంచో విచారిస్తోందని గత అక్టోబర్ నెలలో సీనియర్ అఫ్గాన్ సెక్యూరిటీ వర్గాలు పేర్కొన్నాయి. టెహ్రాన్‌లో Pasdaran ప్రాంతంలో మస్రీని ఇజ్రాయెల్ బలగాలు హతమార్చాయి.



ఈజిప్ట్‌‌కు చెందిన ఉగ్రవాది మస్రీ హతం వెనుక అమెరికా హస్తం ఉందో లేదో అనేది స్పష్టత లేదు. మరోవైపు ఈ రిపోర్టును శనివారం ఇరాన్ ఖండించింది. తమ భూభాగంపై అల్ ఖైదా ఉగ్రవాదులేవరు లేరని స్పష్టం చేసింది.