Israel Iron Dome : గాజా రాకెట్లను గాల్లోనే పేల్చేస్తున్న ఇజ్రాయెల్ ఐరన్ డోమ్

ఇజ్రాయిల్ బలగాలు, హమాస్ ఉగ్రవాదుల మధ్య దాడులు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. గాజా నుంచి ఉగ్రవాదులు ప్రయోగించే రాకెట్లను ఇజ్రాయెల్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ ఆకాశంలో దూసుకొచ్చే రాకెట్లను సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయి.

Israel Iron Dome : గాజా రాకెట్లను గాల్లోనే పేల్చేస్తున్న ఇజ్రాయెల్ ఐరన్ డోమ్

Israel's Iron Dome Proves Successful Against Gaza Rockets (1)

Iron Dome missile defense system : ఇజ్రాయిల్ బలగాలు, హమాస్ ఉగ్రవాదుల మధ్య దాడులు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. గాజా నుంచి ఉగ్రవాదులు ప్రయోగించే రాకెట్లను ఇజ్రాయెల్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ ఆకాశంలో దూసుకొచ్చే రాకెట్లను సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. డజన్ల కొద్దీ మెరుస్తున్న బుల్లెట్లతో ఆకాశమంతా సైరన్లు పేలుళ్ల మధ్య ప్రకాశవంతంగా వెలిగిపోతోంది. వరుస రాకెట్లతో ఉగ్రవాదులు దాడులు చేస్తున్నా విధ్వంసం జరగకుండా ఇజ్రాయెల్‌ ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తోంది. ఇదంతా ఐరన్‌ డోమ్‌ వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు.

Iserals Missle

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రికత్తల నేపథ్యంలో గాజాలోని హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పైకి 1,050కి పైగా రాకెట్లు, మోర్టార్ షెల్స్‌తో దాడులకు తెగబడ్డారు. ఈ హింసాకాండలో ఇజ్రాయెల్‌ ఐరన్ డమ్ దాదాపు 500కి పైగా రాకెట్లను అడ్డుకున్నట్టు ఐడిఎఫ్ పేర్కొంది. ఒక ఐరన్ డోమ్ బ్యాటరీ ఒక రాడార్ యూనిట్ ఎదురుగా దూసుకొచ్చే రాకెట్లను సెకన్ల వ్యవధిలో గుర్తించి వెంటనే నిర్విర్యం చేసేస్తున్నాయి. తక్కువ దూరాలో శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయడానికి స్వల్ప శ్రేణి రాకెట్లు, మోర్టార్లను వాడుతుంటారు. దూరం తక్కువ ఉండటంతో ఎదుర్కోవడానికి శత్రువులకు తగినంత సమయం ఉండదు. ఇలాంటి ప్రమాదాలను ముందుగానే పసిగట్టి గాల్లోనే ధ్వంసంచేసే వ్యవస్థే ఐరన్‌ డోమ్‌. ఒక బ్యాటరీలో మూడు లేదా నాలుగు రాకెట్ లాంచర్లు ఉంటాయి. వీటిలో 20 క్షిపణులు ఉన్నాయి.

Isereals

ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం 10 మొబైల్ ఐరన్ డోమ్ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) కోసం సైనిక రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రకారం.. ఒకే బ్యాటరీ మధ్య తరహా నగరాన్ని రక్షించగలదు. గరిష్టంగా 70 కిలోమీటర్ల దూరం నుంచి కాల్చిన రాకెట్లను విజయవంతంగా అడ్డుకోగలదు. దేశం మొత్తాన్ని రక్షించడానికి 13 ఐరన్ డమ్ వ్యవస్థలు అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐరన్ డోమ్ స్వల్ప-శ్రేణి రాకెట్లను అడ్డగించడానికి వీలుగా రూపొందించారు. జనవరి నుండి పదేళ్లలో 2,400కి పైగా రాకెట్లను అడ్డుకున్నాయి. ఒక క్షిపణికి సుమారు, 66,000 (80వేల డాలర్లు) పౌండ్లు ఖర్చవుతుందని అంచనా.

Isereal

అమెరికా సాయంతో ఇజ్రాయిల్‌కు చెందిన రఫేల్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ పదేళ్ల క్రితమే అభివృద్ధి చేసింది. 2011లో ఐరన్ డమ్‌ వ్యవస్థను వినియోగంలోకి తీసుకొచ్చింది. గాజాస్ట్రిప్ వైపు నుంచి ఉగ్రవాదులు ప్రయోగించే రాకెట్లు, మోర్టార్‌ షెల్స్‌ని దీటుగా ఎదుర్కొంటుంది. గాజాస్ట్రిప్‌లో రాకెట్‌ ప్రయోగించిన వెంటనే రాడార్‌ పసిగట్టేస్తుంది. వెంటనే సమాచారాన్ని సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థకు పంపిస్తుంది. టార్గెట్‌ రాకెట్‌ ఏ ప్రదేశంలో పడుతుందో ముందుగా గుర్తిస్తుంది. ఖాళీ ప్రదేశాల్లలో రాకెట్‌ను ప్రయోగించదు. జనావాసాలపై పడే అవకాశం ఉంటే మాత్రం బ్యాటరీ నుంచి రాకెట్‌ను ప్రయోగించి శత్రువుల రాకెట్‌ను గాల్లోనే పేల్చివేస్తుంది. ఈ ఐరన్ డమ్ సక్సెస్‌ రేట్‌ 90 శాతంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇజ్రాయిల్ బలగాలు, హమాస్ ఉగ్రవాదుల మధ్య దాడులు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. గాజా నుంచి రాకెట్లను హమాస్ ఉగ్రవాదులు ప్రయోగిస్తున్నారు. గాజాపై ఇజ్రాయిల్ దళాలు వైమానిక దాడులతో ప్రతిదాడికి దిగాయి. వైమానిక దాడుల్లో గాజాలో ఇప్పటివరకూ 65 మంది మృతిచెందారు. హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయిల్ లో ఏడుగురు మృతిచెందారు.