SPACEలో ప్లంబర్ లేడా : అంతరిక్షంలో టాయిలెట్లు బ్రేక్.. లీకైన వాటర్

మీ ఇంట్లో టాయిలెట్ వాటర్ లీక్ అయిందంటే ఏం చేస్తారు. కుదిరితే మీరే దగ్గరుండి రిఫైర్ చేస్తారు. లేదంటే.. ప్లంబర్ కు కాల్ చేసి పిలిపిస్తారు. అదే ఇంటర్నేషనల్ స్పెస్ స్టేషన్ లో టాయిలెట్ బ్రేక్ అయితే పరిస్థితి ఏంటి. ఎవరిని పిలుస్తారు.

  • Published By: sreehari ,Published On : February 7, 2019 / 08:05 AM IST
SPACEలో ప్లంబర్ లేడా  : అంతరిక్షంలో టాయిలెట్లు బ్రేక్.. లీకైన వాటర్

మీ ఇంట్లో టాయిలెట్ వాటర్ లీక్ అయిందంటే ఏం చేస్తారు. కుదిరితే మీరే దగ్గరుండి రిఫైర్ చేస్తారు. లేదంటే.. ప్లంబర్ కు కాల్ చేసి పిలిపిస్తారు. అదే ఇంటర్నేషనల్ స్పెస్ స్టేషన్ లో టాయిలెట్ బ్రేక్ అయితే పరిస్థితి ఏంటి. ఎవరిని పిలుస్తారు.

మీ ఇంట్లో టాయిలెట్ వాటర్ లీక్ అయిందంటే ఏం చేస్తారు. కుదిరితే మీరే దగ్గరుండి రిఫైర్ చేస్తారు. లేదంటే.. ప్లంబర్ (పైపులు రిఫైర్ చేసేవాడు)కి కాల్ చేసి పిలిపిస్తారు. అదే ఇంటర్నేషనల్ స్పెస్ స్టేషన్ లో టాయిలెట్ బ్రేక్ అయితే పరిస్థితి ఏంటి. ఎవరిని పిలుస్తారు. భూమి ఉపరితలానికి 250 మైళ్ల దూరంలో ఉన్న అంతరిక్షంలోకి ప్లంబర్ ఎలా వస్తాడు. సాధ్యం కానిపని. మరి అంతరిక్షంలో లీకైన టాయిలెట్ వాటర్ ను కంట్రోల్ చేయడం ఎలా. సమస్యకు సొల్యుషన్ దొరకడం కష్టమే. ఇలాంటి పరిస్థితే ఇటీవల స్పెస్ స్టేషన్ లో ఎదురైంది. అంతరిక్షంలో టాయిలెట్ ఫెసిలిటీని అప్ గ్రేడ్ చేసే ప్రయత్నంలో అనుకోకుండా వాటర్ లీకయిందట. స్పెస్ స్టేషన్ లో ఒక్కసారిగా వాటర్ లీక్ అవడంతో ఐఎస్ఎస్ సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

 

2008లో ఐఎస్ఎస్ స్టేషన్ లో టాయిలెట్ నిర్మించారు. స్పెస్ షటిల్ మిషన్స్ కొనసాగుతున్న సమయంలో ఈ టాయిలెట్ ను నిర్మించారు. దాదాపు 19 ఏళ్లు కావడంతో టాయిలెట్ డిజైన్ పాతపడిపోయింది. దీంతో ఈ టాయిలెట్ ను అప్ గ్రేడ్ చేసేందుకు ఐఎస్ఎస్ వ్యోమగామిలు గతవారమే మరమ్మత్తులు స్టార్ట్ చేశారు. కొత్త డిజైన్ తో టాయిలెట్ ను అప్ గ్రేడ్ ఇన్ స్టాల్ చేయబోయి విఫలయత్నం చెందారు. ప్రత్యేకించి కొన్ని వాటర్ పైపులు డ్యామేజీ అయ్యాయి. దీంతో 2.5 గెలాన్ల వాటర్ లీక్ అయింది. స్టేషన్ ప్రాంగణం నీటితో నిండిపోయింది. చివరికి ఎలాగో అలా టాయిలెట్ వాటర్ లీకేజ్ ను కొంతమేరకు మాత్రమే నియంత్రించగలిగారు. వ్యోమగాములంతా కలిసి లీకైన వాటర్ ను సేకరించి అత్యంత కష్టంగా లీకైన పైపులను రిఫైర్ చేశారు. ఇంకా మరికొన్ని కాంప్లికేషన్స్ అలానే ఉండిపోయాయి. 
 

NASA (నాసా) బ్లాగ్ పోస్టు ప్రకారం.. ఐఎస్ఎస్ అంతరిక్ష వ్యోమగామిలు స్పెస్ స్టేషన్ టాయిలెట్ లో న్యూ యూనివర్శల్ వెస్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (UWMS)ను ఇన్ స్టాల్ చేసేందుకు యత్నించినట్టు తెలిపింది. ఈ కొత్త టాయిలెట్ సిస్టమ్ అత్యాధునిక టెక్నాలజీతో డిజైన్ చేశారు. చూడటానికి ఎంతో చిన్నగా, ఎంతో క్లీన్ గా, చాలా తేలికగా ఉంటుంది. ప్రస్తుత టాయిలెట్ డిజైన్ కంటే సమర్థవంతంగా పనిచేస్తుంది. రానున్న రోజుల్లో నాసా.. ఓరియన్ స్పెస్ క్రాఫ్ట్ పై కూడా UWMS ఇన్ స్టాల్ చేసేందుకు ప్లానింగ్ చేస్తోంది. UWMS సిస్టమ్ ను ఇన్ స్టాల్ చేయాలనే ప్రతిపాదన మేరకు నాసా వచ్చే దశబ్ద కాలంలో ల్యూనర్ స్పెస్ స్టేషన్ దగ్గర నిర్మించనుంది.