village’Built its own sun’: 3నెలలు సూర్యుడు ఉదయించని గ్రామం..వెలుగు కోసం ‘కొత్త సూర్యుడి’ సృష్టి

‘చీకటిగా ఉందని చింతిస్తూ కూర్చోకు ఓ చిరుదివ్వెను వెలిగించుకో‘ అనే మాటను నిజం చేసుకున్నారు ఆ గ్రామస్తులు. 3 నెలలు సూర్యుడు ఉదయించని గ్రామస్తులు కొత్త సూర్యుడిని తయారు చేసుకున్నారు.

Italian Viganella”village ‘built its own sun’ : ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలకు కొదువేలేదు. అటువంటిదే సూర్యోదయం. సూర్యోదయం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు కన్యాకుమారిలో సూర్యోదయం చూడటానికే ఎంతోమంది పర్యాటకు వేకువఝామునే సముద్రతీరానికి చేరుకుంటారు. కానీ మూడు నెలల పాటు సూర్యుడు ఉదయించని గ్రామం గురించి తెలుసా? ఆ మూడు నెలల పాటు ఆ గ్రామస్తులు చీకటిలోనే ఉండాల్సిన పరిస్థితి. సూర్యుడు లేకపోతే ఏంటీ కరెంట్ ఉంటుందిగా అంటారా? కానీ సాధారణ వెలుగులు కూడా సరిపోనంత చీకటి ఉంటుంది ఆ గ్రామంలో. అందుకని ఆ గ్రామస్తులంతా కలిసి ఓ ఐడియా వేశారు. ఏంటా ఐడియా తెలుసా. ‘కొత్త సూర్యుడు‘ని ఏర్పాటుచేసుకున్నారు. ఈ కొత్త సూర్యుడు కోసం దాదాపు 8.7 లక్షల రూపాయలు ఖర్చుపెట్టారు. కొత్త సూర్యుడా? ఏంటీ ఏకంగా చైనా దేశంలాగా ఓ సూర్యుడిని తయారు చేసేసుకున్నారా ఏంటీ అనుకుంటున్నారా? అంత కాకపోయినా దాదాపు అటువంటిదే. ఇంతకీ ఆ వింత గ్రామం ఏంటీ? ఆ కొత్త సూర్యుడు విశేషాలేంటో చూద్దాం.

అది ఇటలీలోని ఓ చిన్న గ్రామం. పేరు.. విగనెల్లా. నవంబర్ వచ్చిందంటే చాలు విగనెల్లా ‘అంధకారం’లో కూరుకుపోతుంది. మళ్లీ ఫిబ్రవరి వరకూ అదే పరిస్థితి. ఎత్తైన కొండల మధ్యలో ఉన్న లోయలో ఎక్కడో కింద కూరుకుపోయినట్టు ఉంటుంది విగనెల్లా గ్రామం. ఇటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామప్రజలు మూడు నెలల పాటు సూర్యోదయాన్ని చూడలేరు. ప్రతీ సంవత్సరం అదే పరిస్థితి విగనెల్లా గ్రామానిది. అంతేకాదు.. చుట్టూతా కొండలు ఉండటంతో సూర్యకిరణాలు వారిని తాకవు. దీంతో..అక్కడ మూడు నెలల పాటు అంధకారమే రాజ్యమేలుతుంది. అందుకే విగనెల్లాని సూర్యుడు ఉదయించని గ్రామం అంటారు.

లైట్లు వేసుకున్నా ఆ వెలుగు ఆ గ్రామానికి సరిపోదు. ఎందుకంటే సాధారణ లైట్ల వెలుతురు తొలగించలేనంత అంధకారం అలుముకుంటుంది. సూర్యరశ్మి మనిషి శరీరానికి ఎంత అవసరమో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. సూర్యరశ్మి కేవలం మనుషులకే కాదు చెట్లకు, మొక్కలకు, పంటలకు చాలా చాలా అవసరం. అలా సూర్యరశ్మికి దూరమైన ప్రజలు ఎదుర్కొనే ప్రత్యేక స్థితి విగనెల్లా గ్రామస్తులు ఎదుర్కొంటున్నారు. వెలుగు లేక నిస్తేజంగా ఉండిపోవాల్సి వస్తుంది. ఉదయం లేచి సూర్యకిరణాలు మీద పడితే ఆ ఉత్సాహమే వేరు. రోజు వారి పనుల్లో పడిపోతాం.

అలాకాకుండా ఎప్పుడు చీకటే ఉంటే ఇక పనులేం చేసుకుంటాం? పనులు చేసుకోవాలనే ఉత్సాహం ఎలా వస్తుంది? అందుకే సూర్యరశ్మి లేక సూర్యుడు వెలుగులు లేక నిస్తేజంగా ఉండిపోవటంతో పాటు నిస్సత్తువగా మారిపోతున్నారా గ్రామ ప్రజలు. అంతేకాదు విగనెల్లా ప్రజల్లో సెరటోనిన్ అనే హార్మోన్ లోపించి.. నీరసం, నిస్ఫృహలకు లోనవుతారని నిపుణులు అంటున్నారు. ఈ నిరుత్సాహకర వాతావరణం నేరాల పెరగటానికి కూడా కారణమవుతోందంటున్నారు.

కానీ ఇదంతా 2008 సంవత్సరానాకి ముందు విగనెల్లా గ్రామవాసులు ఎదుర్కొన్న పరిస్థితి. కానీ వారిలో కొత్త ఆలోచన పుట్టాక..అది అమలులోకి వచ్చాక వారి పరిస్థితులే మారిపోయాయి. గ్రామస్తులు ఓ కొత్త సూర్యుడిని ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా జస్ట్ 10 వేల యూరోల అంటే మన భారత కరెన్సీలో దాదాపు 8.7 లక్షల రూపాయల ఖర్చుతో.

అదేలా అంటే..8 మీటర్లు పొడవు.. 4 మీటర్లు వెడల్పుతో బాగా మందంగా ఉండే ఓ స్టీల్ స్క్రీన్ ను తెచ్చి కొండలపై ఉన్న అత్యంత ఎత్తైన ప్రదేశంలో అమర్చారు. దీంతో..సూర్యోదయం కాకపోయినా..సూర్యుడి ప్రతిబింబం ఆ గ్రామంపై కాంతిని ప్రసరింపజేసేలా ఏర్పాటు చేశారు.

అలా..గ్రామంపై సూర్యకాంతి కిరణాలు పడి..మునుపటి వెలుగులను, ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. దీంతో విగనెల్లా.. సొంతంగా సూర్యుడిని ఏర్పాటు చేసుకున్న గ్రామంగా పేరొందింది. ఇదే స్ఫూర్తితో నార్వేలోని జుకాన్ అనే గ్రామం కూడా 2013లో ఇలా కొత్త సూర్యుడిని ఏర్పాటు చేసుకుని చీకట్లను పారద్రోలి కొత్త వెలుగుల్ని సాధించింది.

 

ట్రెండింగ్ వార్తలు