ఇటలీ గ్రామం స్పెషల్ ఆఫర్: 86రూపాయలకే ఇల్లు.. కండిషన్స్ అప్లై

ఇటలీ గ్రామం స్పెషల్ ఆఫర్: 86రూపాయలకే ఇల్లు.. కండిషన్స్ అప్లై

Italian village selling homes: ఇటలీలోని ఓ గ్రామంలో ఇళ్లు అమ్మకానికి పెట్టారు. కేవలం 90రూపాయలకు ఇంకా బేరమాడితే అంతకంటే తక్కువకు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. కాకపోతే అది రెనోవేట్ చేయించుకోవాలి. ఇది నమ్మశక్యంగా లేకపోయినా నిజమే.

ఇటలీలోని సికిలీ గ్రామంలో ఈ అమ్మకాలు జరుగుతున్నాయి. సిటీలకు వెళ్లిపోవాలని ఆ గ్రామమంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు. వారందరినీ వెనక్కు రప్పించాలని మేయర్ సెబాస్టియానో ఫాబియో వెనెజియా ప్లాన్ చేశారు. ఆ ప్రాంతంలో జనాభా తగ్గిపోతుందని పునరుద్ధరించడానికి ఇలా ప్లాన్ చేస్తున్నారు.

ఆ గ్రామమంతా కొండలపై చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంటుంది. అటవీ ప్రాంతంలో 4వేల హెక్టార్ల మేర ఇళ్లు కట్టేసుకున్నారు. ప్రశాంతమైన ప్రదేశం కావడంతో గుర్రపు స్వారీలకు చాలా అనువుగా ఉంటాయి. అక్కడ వాతావరణానికి తగ్గట్లుగా గాడిదలు, బ్రెడ్, తాజా కూరగాయలు అందుబాటులో ఉండటంతో పాటు కాలుష్య రహిత ప్రాంతం.

అది బిజీ టౌన్ కాదు కాబట్టే అంత ప్రశాంతంగా ఉంది. నిజానికి ఆ కారణంగానే ప్రాంతంలో ఉండే వారంతా ఇతర ప్రదేశాలకు వెళ్లిపోయారు కూడా. సిటీ లైఫ్ మీద ఎటువంటి ఆసక్తి లేనివారు కొనుగోలు చేయడానికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్.

అక్కడి వారికి ఓకే కానీ, ఇండియన్లు ఆ ఇల్లు కొనాలంటే కాస్త ఇబ్బందే మరి. ఎలా అంటే ఇల్లు కొనుక్కుని దానిని మళ్లీ రెనోవేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. దాని కంటే ముందు డిపాజిట్ అమౌంట్ కింద 5వేల యూరోలు (రూ.43లక్షలకు పైగా) జమ చేయాలి. మొత్తం రెనోవేషన్ అయిపోయిన తర్వాత డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు.

అలా ఏం అవసర్లేదు రెనోవేషన్ చేయించుకోకుండా ఆ ప్రదేశంలో మరేదైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటే రూ.86లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.