2,000 ఏళ్ల చరిత్ర : తవ్వకాల్లో బైటపడ్డ రోమన్‌ చక్రవర్తుల కాలం నాటి రథం..

2,000 ఏళ్ల చరిత్ర : తవ్వకాల్లో బైటపడ్డ రోమన్‌ చక్రవర్తుల కాలం నాటి రథం..

Italy archeologists :  పురావస్తు పరిశోధకుల అన్వేషణల్లో ఎన్నో అమూల్యమైన వస్తువులు బైటపడుతుంటాయి. వారి తవ్వకాల్లో చరిత్ర గొప్పతనం బైటపడుతుంటుంది. అటువంటి తవ్వకాల్లో పరిశోధకులు మరో అరుదైన అద్భుతమైన వేల సంవత్సరాల నాటి చరిత్రను వెలికితీశారు. ఆ అద్భుతమైన చరిత్ర ఏంటో తెలుసా? చరిత్రలో తమకంటూ ఓ విశేష స్థానాన్ని ఏర్పరచుకున్న రోమన్ చక్రవర్తుల కాలం నాటి అద్భుతమైన రథాన్ని వెలికి తీసారు పరిశోధకులు..!!

రోమన్‌ చక్రవర్తుల కాలానికి చెందిన 2,000 ఏళ్ల క్రితం నాటి రథాన్ని వెలికితీశారు. ఈ రథం ఇన్ని సంవత్సరాలుగా భూమి పొరల్లో కప్పబడిపోయినప్పటికీ ఈనాటికి చెక్కు చెదరకుండా ఉండటం మరో విశేషంగా అని చెబుతున్నారు పరిశోధకులు. దక్షిణ ఇటలీలోని పాంపేయి పట్టణంలో శనివారం ( ఫిబ్రవరి 27,2020)ఈ రథాన్ని కనుగొన్నట్టు పరిశోధకులు తెలిపారు.

జెన్నీఫర్‌ లారెన్స్‌ నటించిన ‘హంగర్‌ గేమ్స్‌’లో చూపించినట్టుగా ఈ రథాన్ని కూడా గుర్రాల సాయంతో నడిపేవారని పరిశోధకులు వెల్లడించారు. రథంపై ఇనుము, కాంస్యం, కర్రతో చేసిన కొన్ని గుర్తులు, నిర్మాణాలు ఉన్నాయని అవి ఈ రథం మీద కనిపిస్తున్నాయని తెలిపారు. ఆనాటి కాలానికి సంబంధించిన ఒక వస్తువును ఇంత చెక్కు చెదరని స్థితిలో గుర్తించడం ఇదే తొలిసారని పరిశోధకులు వెల్లడించారు.

కాగా క్రీ.శ 79లో వెసుమియన్ పర్వతం విస్ఫోటనం పాంపీ పట్టనాన్ని నాశనం చేసింది. ఈ విస్ఫోటనంలో ఈ రథం కప్పబడిపోయింది. వెసుమియన్ పర్వత ప్రాంతాల్లో ఉండే కొన్ని భవనాల్లో పరిశోధకులు తవ్వకాలు జరుపగా ఓ భవనంలో ఈ రథం బైటపడింది.