అధికారులపై దుమ్మెత్తిపోస్తున్న Covid బాధిత కుటుంబాలు

  • Published By: Subhan ,Published On : June 12, 2020 / 09:04 AM IST
అధికారులపై దుమ్మెత్తిపోస్తున్న Covid బాధిత కుటుంబాలు

ప్రపంచమంతా లాక్‌డౌన్ సడలింపులు కరోనాకు ఆజ్యం పోస్తున్నాయి. చాప కింద నీరులా కాదు.. వరదలా నలు వైపుల నుంచి ముంచుకొచ్చేస్తుంది. ట్రీట్‌మెంట్ కు నోచుకోని వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తమకు సాయం అందడం లేదంటూ ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీస్తున్నాయి. 

ఇటలీలోని లాంబర్డీలో బెర్గామ్ నగర వాసులు Covid-19 కారణంగా కుటుంబంలోని వ్యక్తులను పోగొట్టుకున్న వాళ్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావంతో చనిపోయిన వారిలో లాంబర్డీ సిటీలోనే ఎక్కువ మంది దాదాపు 34వేలకు పైగా ఉన్నారు. 

‘ప్రజలు వివరణ అడుగుతున్నారు. న్యాయ వ్యవస్థను అనుసరించి వారు న్యాయం కోరుతున్నారు. ఇది ప్రతి ఒక్క అధికారికి కనువిప్పు కావాలని’ 40 కుటుంబాలు తరపున లాయర్ కాన్సులె లొకాటీ ప్రశ్నిస్తున్నారు. 

జవాబుదారీతనం: బెర్గామో న్యాయవాదులు లాంబర్డీ ప్రెసిడెంట్ వారు తీసుకుంటున్న జాగ్రత్తలను ప్రశ్నించారు. తీవ్రంగా ఎఫెక్ట్ అయిన ప్రాంతాలను సీల్ చేయడంపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇక తర్వాత న్యాయం కోసం ఇటలీ మంత్రులను కలిసి.. ఆ తర్వాత నేరుగా ప్రధాన మంత్రి దగ్గరకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. 

Read:నడిరోడ్డుపై తల్లీ..పసిబిడ్డలపై చైనా పోలీసుల దాష్టీకం చూడండీ..