ఇళ్లనుంచి బైటకొస్తే.. జైల్లో వేస్తాం జాగ్రత్త..ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు

  • Published By: veegamteam ,Published On : March 10, 2020 / 08:35 AM IST
ఇళ్లనుంచి బైటకొస్తే.. జైల్లో వేస్తాం జాగ్రత్త..ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు

ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఉల్లంఘించి ప్రజలు బైటకు వస్తే జైలుశిక్ష తప్పదని ఇటలీ ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇటలీలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తునన క్రమంలో ప్రభుత్వం ప్రజలకు పలు ఆంక్షలు విధించింది. ఇటలీలో రోజు రోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరగటంతో  కరోనాను కట్టడి చేయడం కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. 

ఈ కరోనా ప్రభావంతో కోట్లమంది ప్రజలను అధికారులు గృహనిర్బంధం చేసింది. చైనా లో మొదలైన ఈ మహమ్మారి అక్కడ నుంచి ప్రపంచ దేశాలకు పాకుతూ పోతుంది. దీంతో ఆయా దేశాలు అప్రమత్తమై కరోనాను కట్టటడి చేయటానికి పూనుకుంటున్నాయి. అయినా సరే ఈ వైరస్ విస్తరిస్తునూ ఉంది.  

ఈ క్రమంలో ఇటలీలోని లాంబార్డీ ప్రాంతంలో  కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో అయితే అత్యవసరమైన పరిస్థితులలోనే ప్రజలు బయటకి రావాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎవరైనా సరే ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే మూడు నెలల జైలు శిక్ష తప్పదు హెచ్చరించింది. అంటే కరోనా వైరస్ ఎంత ప్రమాదకరంగా మారిందో ఊహించుకోవచ్చు. ఈ కరోనా ఇటలీలో 24 గంటల్లో 1200లమందికి వ్యాపించింది.  దీతో లాంబార్డీ ప్రాంతంతో పాటు ఇటలీలోని నాలుగు రాష్ట్రాలు..కరోనా ప్రభావం ఉన్న 19 ప్రాంతాల్లో ప్రజలపై ప్రభుత్వం ఇటువంటి ఆంక్షలు విధించింది. 

ఆదివారం నుంచి మ్యూజియంలు, జిమ్‌లు, సాంస్కృతిక కేంద్రాలు, రిసార్ట్స్, స్విమ్మింగ్ పూల్స్ వంటివాటిని మూసివేసింది. లాంబార్డీ ఏరియాలోని యూనివర్శిటీలను కూడా మూసివేసింది. ఏప్రిల్ 3వరకూ వర్శిటీలను తెరవకూడదని..దేశ వ్యాప్తంగా మార్చి 15వరకూ స్కూల్స్ లను కూడా మూసివేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇటలీలోని ఆర్థిక వ్యవస్థపై    కరోనా ప్రభావం చాలా తీవ్రంగా పడింది. 

See Also | అంబానీ ఇప్పుడు రిచెస్ట్ ఏషియన్ కాదు.. ఆ కిరీటం ఆలీబాబా జాక్‌మాది