బర్త్ డే జరుపుకున్న తర్వాత బోల్ట్ కు కరోనా

  • Published By: madhu ,Published On : August 25, 2020 / 07:00 AM IST
బర్త్ డే జరుపుకున్న తర్వాత బోల్ట్ కు కరోనా

చిరుత వేగంతో పరుగుత్తే వరల్డ్ సూపర్ అథ్లెట్ ఉస్సేన్ బోల్ట్ బర్త్ డే వేడుకలు జరుపుకున్న కొద్ది రోజులకే కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.



ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు, అయితే..వైరస్ లక్షణాలు మాత్రం ఏవీ లేవన్నారు. నిబంధను పాటిస్తూ..తనకు తాను నియంత్రించుకున్నానన్నారు. అందరూ సేఫ్ గా ఉండాలని, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు.

అయితే..ఇదిలా ఉంచితే..బోల్ట్ ఆగస్టు 21వ తేదీన 34వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంతో మంది ప్రముఖులు హాజరై..డ్యాన్స్ లు చేస్తూ..సందడి సందడి చేశారు. వెస్ట్ ఇండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్, ఇంగ్లండ్, మాంచెస్టర్ సిటీ ఫార్వర్డ్ ఆటగాడు రహీమ్ స్టెర్లింగ్, బేయర్ లెవర్ కుసెన్ తదితరులు హాజరయ్యారు.



ప్రాణంతకమైన కరోనా వైరస్ వ్యాపిస్తున్న క్రమంలో పలు దేశాలు ఆంక్షలు విధించాయి. బోల్ట్ బర్త్ డే పార్టీలో ఎవరూ నిబంధనలు పట్టించుకోలేదని ఓ వీడియో చూస్తే అర్థమౌతుంది. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా..వేడుకలు జరుపుకున్నారు.