జపాన్‌లో కన్ఫామ్ అవుతున్న యూకే కొత్త వైరస్ కేసులు

జపాన్‌లో కన్ఫామ్ అవుతున్న యూకే కొత్త వైరస్ కేసులు

Coronavirus: ప్రపంచదేశాలను వణికించిన Covid-19 బాటలోనే నడుస్తుంది కొత్త వైరస్ కూడా. యూకేలో ప్రతి రోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు జపాన్ లోనూ నమోదైనట్లు జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కన్ఫామ్ చేసింది. బ్రిటన్‌లో లక్షణాలతోనే కొత్త వైరస్ ఉందని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 18నుంచి డిసెంబర్ 21మధ్య సమయంలో ఐదుగురు జపాన్ కు వచ్చారు.

రాకపోకలు నిలిపివేయడానికి ముందే ఈ ఐదుగురు వచ్చినట్లు సమాచారం. 60ఏళ్లకు పైబడ్డ వారిలో నీరసంతో పాటు ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయి. మిగిలిన ఐదుగురిలో ఎటువంటి లక్షణాలు లేవు. ఆరోగ్య శాఖ మంత్రి నోరిహిసా తమూరా మాట్లాడుతూ.. ఆ ఐదుగురిని ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా క్వారంటైన్ కు పంపినట్లు చెప్పారు.

వారికి వైరస్ పాజిటివ్ వచ్చిన అనంతరం.. తర్వాత టెస్టులకు, వైరస్ విశ్లేషణకు పంపించాం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఈ విశ్లేషణ జరుపుతుంది. కొత్త వైరస్ పాతదాని కంటే 70శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కొత్త వైరస్ దేశంలోకి ఎంటర్ అవకుండా గవర్నమెంట్ టాస్క్‌ఫోర్స్ హెడ్ షిగేరు ఓమీ బోర్డర్ దగ్గర పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.