Controversial School : విద్యార్ధులకు చేపలు ఇచ్చి వాటిని పెంచి చంపేమంటున్న స్కూల్..ఎందుకంటే..

స్కూల్ విద్యార్ధులకు టీచర్లు చేపలను ఇచ్చి వాటిని చక్కగా పెంచాక వాటిని చంపేయమని చెప్పారు.దీంతో పాపం అప్పటి వరకు చేపల్ని ఎంతో ఇష్టంగా పెంచుకున్న వాటిని చంపేయమని చెప్పేసరికి పాపం ఆ విద్యార్ధులు బిక్కమొహాలు వేశారు. అయ్యో..బుజ్జి బుజ్జి చేపల్ని చక్కగా పెంచాక చంపేయమంటారేంటి టీచర్..అవంటే మాకు చాలా ఇష్టం అయిపోయింది వాటిని చంపలేం అంటున్నారు.

10TV Telugu News

Japan Controversial School Project : ఓ స్కూల్ విద్యార్ధులకు టీచర్లు చేపలను ఇస్తున్నారు. వాటిని చక్కగా పెంచమంటున్నారు. వాటి ఆలనా పాలనా చూస్తు వాటిని సంరక్షించమంటున్నారు. అలా చేపల్ని తీసుకున్న విద్యార్ధులు వాటిని చక్కగా పెంచుకుంటున్నారు. వాటితో చక్కగా ఊసులు చెబుతూ..ఆహారం వేస్తూ వాటిని చక్కగా పెంచుతున్నారు. అలా పెంచిన చేపల్ని పెంచాక వాటిని చంపేయండి అని చెబుతున్నారు టీచర్లు. దీంతో పాపం ఆ విద్యార్ధులు బిక్కమొహాలు వేశారు. అయ్యో..బుజ్జి బుజ్జి చేపల్ని చక్కగా పెంచాక చంపేయమంటారేంటి టీచర్..అవంటే మాకు చాలా ఇష్టం అయిపోయింది వాటిని చంపలేం అంటున్నారు. కానీ టీచర్లు మాత్రం వాటిని చంపేయండీ..తినేయండీ అని చెప్పటంతో పాపం విద్యార్దులు తెగ బాధపడిపోతున్నారు. ఇంతకీ టీచర్లు విద్యార్ధులకు చేపలు ఎందుకిచ్చారు?ఎందుకు పెంచమన్నారు? ఆ తరువాత వాటిని చంపేయమని ఎందుకు అంటున్నారో తెలుసుకోవాలని ఉంది కదూ..

అది జపాన్‌లోని నిప్పాన్ ఫౌండేషన్ స్కూల్. ఆ స్కూల్ టీచర్లు విద్యార్థులకు ఓ వింత ప్రాజెక్టు ఇచ్చారు. ప్రాజెక్ట్‌ను ఆరు సంవత్సరాలు (2019)గా సెంటర్ ఫ్యాకల్టీ పాఠ్యాంశాల్లో భాగంగా ఉంది. ఈ పాజెక్ట్‌లో భాగంగా విద్యార్థులకు టీచర్లు ఓ చేపను ఇస్తారు. విద్యార్థులు ఆ చేపకు తల్లీదండ్రులుగా ఆలన పాలన చూసుకోవాలి. దాన్ని చక్కగా పెంచాలి. ఒకవేళ ఆ చేప చనిపోతే మరో చేప ఇస్తారు. అలా ఇచ్చిన చేపను ఎనిమిది నెలలు పెంచాలి. అలా పెంచి పెద్ద చేసి చేపను వారే స్వయంగా చంపి తినేయాలి. లేదంటే సముద్రంలో విడిచి పెట్టాలి. ఈరెండింటిలో ఏదోకటి చేయాలి.2020 అక్టోబర్‌లో పశ్చిమ షిజువాకాలోని హమామత్సు మహానగరంలో ఉన్న పౌండేషన్ ఫ్యాకల్టీలో ‘మీకు ఇచ్చిన చేపలను ఏం చేయాలనుకుంటున్నారో.. చెప్పాలని ఉపాధ్యాయులు విద్యార్ధుల్ని అడిగారు. మీరు పెంచిన చేపలను తినడమా? సముద్రంలో వదిలి వేయడమా? అని అడిగారు. 11 మంది విద్యార్థులు చేపలను తినడానికి అంగీకరించారు.

మరో ఆరుగురు సముద్రంలో వదిలివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పటి వరకు వాటితో ఉన్న అనుబంధం వల్ల ఆ విద్యార్థులు తమ చేతులతో ఎంతో ఇష్టంగా పెంచిన ఆ చేపల్ని తినడానికి ఇష్టపడలేదు. అలా ఆ చేపల్ని తినటానికి ఇష్టపడే పిల్లలను దగ్గర పెట్టుకుని..ఓ హోటల్ నుంచి ఓ షెఫ్ ను తీసుకొచ్చి ఆ పిల్లల ఎదురుగానే వారు పెంచిన చేపల్ని ముక్కలు ముక్కలుగా కోయటం చూపిస్తారు. ఆ తరువాత దాన్ని వండటం కూడా చూపిస్తారు. అలా తాము పెంచిన చేపల్ని షెఫ్ ముక్కలుగా కోయటం చూసి పిల్లలు తట్టుకోలేక వద్దు వద్దు చేపల్ని సముద్రంలో వదిలేస్తాం అని నిర్ణయం తీసుకుంటారని పిల్లల ముందే అవన్నీ చేయిస్తారు. దీనిపై జపనీస్‌ ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులు నిర్ణయం తీసుకోవడంలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి..తమకు తాము నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచటానికి ఈ పద్ధతిని వినియోగించామని తెలిపారు. ఇది ప్రకృతి సహజమని తెలియజేస్తుందని తెలిపారు.

జపాన్ పిల్లల ఈ అటాచ్మెంట్ పరీక్షను క్లాస్ ఆఫ్ లైఫ్ అనే కార్యక్రమం కింద తీసుకుంటారు. జపాన్ దేశంలో వివాదాస్పద విద్యా కార్యక్రమ పద్ధతి ఇది. మిడిల్ స్కూల్ పిల్లల సిలబస్‌లో (జపాన్ ఎడ్యుకేషన్ సిస్టమ్) చేర్చబడిన ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు జీవిత ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జపాన్ యొక్క నిప్పాన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సీ అండ్ జపాన్ ప్రాజెక్ట్ యొక్క 2019 సంవత్సరం నుండి, పిల్లలకు సముద్ర జీవులకు సంబంధించిన విషయాలు బోధిస్తారు. ఈ కార్యక్రమం కింద విద్యార్ధులకు కొన్ని చేపలను పిల్లలకు ఇస్తారు. వాటిని వారు 8 నెలలు పెంచుతారు. ఈ సమయంలో, ఈ పిల్లలు వారి ప్రతి అవసరాన్ని చూసుకుంటారు. ఆహారం..నీటిని మార్చటం వంటివన్నీ చేస్తారు.దీంతో వారు ఆ చేపల్ని తినటానికి ఇష్టపడరు. దీంతో వారు ఆ చేపల్ని సముద్రంలో వదిలివేయటానికి ఇష్డపడతారు. కాగా జపాన్ లో ప్రజలు సీఫుడ్ బాగా తింటారనే విషయం తెలిసిందే. బహుశా సీఫుడ్ తినటం తగ్గించటానికి..లేదా సముద్ర జీవుల్ని తినకుండా ఉండటానికి ఇటువంటి కార్యక్రమం ఉద్ధేశమై ఉండొచ్చు.

 

10TV Telugu News