Corona: మరోసారి కరోనా ఉగ్రరూపం.. ఎమ‌ర్జెన్సీ ప్రకటించిన జపాన్

కరోనావైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిన తర్వాత రాజధాని టోక్యోతో సహా ఆరు ప్రాంతాల్లో జపాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ)ని ప్రకటించింది.

Corona: మరోసారి కరోనా ఉగ్రరూపం.. ఎమ‌ర్జెన్సీ ప్రకటించిన జపాన్

Japan

Japan declares state of emergency after record spike in Covid infections: కరోనావైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిన తర్వాత రాజధాని టోక్యోతో సహా ఆరు ప్రాంతాల్లో జపాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ)ని ప్రకటించింది. జపాన్ PM కార్యాలయం PM సుగాను ఉటంకిస్తూ, “ఆగస్టు 31 వరకు, టోక్యోతో పాటు ఆరు ప్రాంతాల్లో జ‌పాన్‌ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది. టోక్యో, సైత‌మ‌, చిబ‌, క‌న‌గ‌వ‌, ఒసాకా, ఒకిన‌వ ప్రాంతాల్లో ఎమ‌ర్జెన్సీ విధిస్తున్నట్లుగా ప్రకటించింది జపాన్ ప్రభుత్వం.

ప్రజలు అవసరం లేకుంటే బయటకు రావొద్దని, అత్యవసరం కాని కారణాల వల్ల బయటకు వెళ్లడం లేదా ప్రయాణం చేయడం మానుకోవాలని ప్రభుత్వం కోరింది. వేసవి ప్రయాణాలలో తమ స్వస్థలాలకు తిరిగి వచ్చే విషయంలో సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది ప్రభుత్వం. ఆగస్ట్ చివరినాటికి 40 శాతం ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ రెండు డోసులు అందించేందుకు కార్యాచరణ సిద్ధం చెయ్యాలని వ్యాక్సినేషన్ కార్య‌క్ర‌మాన్ని వేగ‌వంతం చేయాలని ప్ర‌భుత్వం ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించింది.

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కొత్త కేసుల సంఖ్య గతవారంలో 10శాతం పెరిగింది. ఏప్రిల్ చివరివరకు జూన్ మధ్యలో కరోనా మందగించిన తర్వాత, డెల్టా వేరియంట్ కారణంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది-వియత్నాం మరియు జపాన్ రోజువారీ కేసులలో 61 శాతం పెరుగుదలను నమోదు చేయడంతో-పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. అమెరికా మరియు కెనడాలలో 57శాతం ఎక్కువ కేసులు నమోదవుతూ ఉన్నాయి.