కొత్త శకం : జపాన్ కొత్త చక్రవర్తి

  • Published By: madhu ,Published On : May 1, 2019 / 03:55 AM IST
కొత్త శకం : జపాన్ కొత్త చక్రవర్తి

జపాన్‌కు కొత్త చక్రవర్తి వచ్చారు. 126వ చక్రవర్తిగా నరుహితో ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన తండ్రి అకిహితో (85) క్రైసెంథమమ్ బాధ్యతల నుండి దిగిపోయారు. 59 ఏళ్ల నరుహితో మే 01వ తేదీ బుధవారం సింహాసనాన్ని అధిష్టిస్తారు. మంగళవారం అర్ధరాత్రి నుండే కొత్త శకం ప్రారంభమైంది. అకిహితో 30 ఏళ్ల పాటు జపాన్ చక్రవర్తిగా కొనసాగారు.

ఆయన తనంట తాను పదవి నుండి తప్పుకున్నారు. 200 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. పదవి నుండి దిగిపోయే ముందు అకిహితో రాజ్యప్రసంగం చేశారు. జపాన్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు. అకిహితో చాలా చక్కగా పనిచేశారని ప్రజలు తెలిపారు. కొత్త చక్రవర్తి కూడా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

బుధవారం రూమ్‌ ఆఫ్‌ పైన్‌లో కొద్దిసేపు మాత్రమే జరిగే కార్యక్రమంలో యువరాజు నరుహితో లాంఛనంగా చక్రవర్తిగా రాజ్యాధికారాన్ని చేపడతారు. టోక్యోలోని జపాన్ రాజభవనం అయిన రూమ్ ఆఫ్ ఫైన్‌లో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. జపాన్‌ ప్రధాని షింజో అబే సహా దాదాపు 12మంది రాజకుటుంబీకులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే..అకిహితో వీడ్కోలు సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో జపాన్ వ్యాప్తంగా ప్రజలు వీడ్కోలు వేడుకలను పెద్ద తెరపై వీక్షించారు. నరుహి పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా రాజభవనం పరిసర ప్రాంతాలతో పాటు టోక్యో అంతా భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.