యువతలో ఒంటరితనం పోగొట్టడానికి కొత్త మంత్రిత్వ శాఖ ‘మినిస్టర్ ఫర్ లోన్లీనెస్’

యువతలో ఒంటరితనం పోగొట్టడానికి కొత్త మంత్రిత్వ శాఖ ‘మినిస్టర్ ఫర్ లోన్లీనెస్’

isolation

Japan Govt Gets a Minister of Loneliness : జపాన్‌లో ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా యువతలో ఆత్మహత్య చేసుకోవటం పెరుగుతున్నాయి. 2019తో పోలిస్తే 2020లో ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య 3.7 శాతం పెరిగినట్లుగా ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీని కోసం కొత్తగా మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసిందీ.. అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకోవచ్చు.

యువతలో ఒంటరితనం పెరగటం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ తో ఒంటరితనం పెరిగింది. దీంతో యువతలో ఒంటరితనం పోగొట్టటానికి ‘మినిస్టర్ ఫర్ లోన్లీనెస్’ పేరుతో కొత్తగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

ఒంటరితనం అనేది చాలా సమస్యలకు దారి తీస్తుంది. డిప్రెషన్ లోకి వెళ్లటం..ఆత్మహత్యలకు పాల్పడేలా చేయటం అనేవి ప్రధానమైనవి. దీంట్లో భాగంగానే జపాన్ లో ఒంటిరితనంతో బాధపడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య ఇటీవల పెరిగింది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఆత్మహత్యల నివారణపై దృష్టిసారించింది.

దీంట్లో భాగంగానే..‘మినిస్టర్ ఆఫ్ లోన్లీనెస్’ పేరుతో ఏకంగా ఓ మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది. ఈ శాఖను రీజనల్ రీవైటలేజన్ మంత్రికి కేటాయిస్తూ ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల్లో ఒంటరితనాన్ని పోగొట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారా ఆత్మహత్యలకు పాల్పడకుండా చూడడమే ఈ మంత్రిత్వశాఖ చేయాల్సిన పని.

కాగా టెక్నాలజీ అంటే జపాన్..జపాన్ అంటే టెక్నాలజీ అని చెప్పుకునే దేశం ఇలా ఆత్మహత్యల సమస్యలను ఎదుర్కొంటోంది. జపాన్ కు ఉన్న ప్రధాన సమస్యల్లో యువత ఆత్మహత్యలు ఒకటిగా ఉంది. ఒంటరితనాన్ని తట్టుకోలేని యువత ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. అంతేకాదు జపాన్ లో జననాలు కూడా తగ్గిపోవటం కూడా ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ప్రభుత్వం దేశంలోని యువతకు పలు ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నా పెద్దగా ఫలితాలు కనిపించటంలేదు.

ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకార..2020లో దాదాపు 21 వేల మంది ఒంటరితనంతో బాధపడుతూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అదే 2019తో పోలిస్తే ఇది 3.7 శాతం ఎక్కువ కావడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. కరోనా భయం, క్వారంటైన్, భౌతికదూరం, ఒంటరితనాలకు కారణమైంది.ఈ క్రమంలో యువత ఒంటరితనాన్ని జయించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది.