Japan Population Crisis : జపాన్‌లో బర్త్ రేటు కంటే డెత్ రేటు డబుల్‌..జననాల రేటు పెంచేందుకు కొత్త ఏజెన్సీ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం..

జపాన్‌లో బర్త్ రేటు కంటే డెత్ రేటు డబుల్‌ అవుతోంది. ఈ పరిస్థితిపై ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తోంది. దీంతో జననాల రేటు పెంచేందుకు కొత్త ఏజెన్సీ ఏర్పాటు చేయనుంది ..అంతేకాదు దేశ బడ్జెట్ నుంచి భారీగా నిదులు కూడా కేటాయించింది.

Japan Population Crisis : జపాన్‌లో బర్త్ రేటు కంటే డెత్ రేటు డబుల్‌..జననాల రేటు పెంచేందుకు కొత్త ఏజెన్సీ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం..

Japan papulation Crisis

Japan Population Crisis : జపాన్ పాపులేషన్.. వేగంగా క్షీణిస్తూనే ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇంకొన్నేళ్లకు.. జపాన్ దేశమే అదృశ్యమైపోతుందని.. ఆ దేశ ప్రధానమంత్రి సలహాదారు ఆందోళన వ్యక్తం చేయడం.. ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. జననాల రేటు క్షీణించడాన్ని గనక నిరోధించకపోతే.. జపాన్ మాయమైపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు దశాబ్దాలుగా.. జపాన్ జనాభా తగ్గుతూ వస్తోంది. ఇదిలాగే కొనసాగితే.. 2060 నాటికి ఆ దేశ జనాభా ఎనిమిదిన్నర కోట్లకు చేరుతుందనే అంచనాలున్నాయ్. జనాభా క్షీణిస్తోందంటే.. ఆ దేశం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నట్లు అర్థమని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితులే.. మరికొన్నేళ్లలో జపాన్ జాతీయ శక్తిని మరింత క్షీణింపజేస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు గనక.. అక్కడి ప్రభుత్వం జననాల రేటు పెంచేందుకు సరైన చర్యలు చేపట్టకపోతే.. పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయంటున్నారు.

జనాభా క్షీణతతో.. జపాన్‌లో యువత సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. ఇది కూడా అక్కడి ప్రభుత్వాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు జననాల రేటు పడిపోతుండటంతో.. దేశంలో పరిస్థితులు కూడా క్రమంగా మారిపోతున్నాయ్. మరోవైపు.. వృద్ధుల మరణాల రేటు పెరుగుతోంది. ప్రతి ఏటా.. జపాన్‌లో పుడుతున్న వారి కంటే.. మరణించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. జపాన్​తన ఉనికిని కోల్పోతుందని.. బతకడానికి దేశంలో ఎవరూ ఉండరని అక్కడి పాలకులు, నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Births in Japan: 123 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జపాన్‌లో భారీగా తగ్గిన జననాల రేటు: దేశ ఉనికికే ప్రమాదం?

జపాన్‌లో.. జననాల రేటు తగ్గుతూ వస్తోందంటే.. అక్కడి సొసైటీలో పిల్లలు చాలా తక్కువగా ఉన్నారని అర్థం. ఇదంతా సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని.. వెంటనే పరిస్థితులు చక్కదిద్దకపోతే.. సమాజంలోని భద్రతా వ్యవస్థ కుప్పకూలుతుందని.. రక్షణ రంగంలో రిక్రూట్‌మెంట్‌లు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. చివరికి.. అది దేశ భద్రతకే ముప్పుగా మారొచ్చంటున్నారు. ఇప్పటికే.. జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు.. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. సౌత్ కొరియాలో సంతానోత్పత్తి రేటు దారుణంగా పడిపోతుండగా.. జపాన్‌లో ఏకంగా జనాభానే తగ్గిపోతోంది. పిల్లలను కనేలా.. ప్రజలను ప్రేరేపించేందుకు గతంలో జపాన్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఎక్కువ మంది పిల్లల్ని కనండంటూ ఆఫర్లు ప్రకటించింది. దేశంలో జనాభా పెరుగుదల ఆవశ్యకతపై.. పెళ్లయిన జంటలకు అవగాహన కల్పించింది ప్రభుత్వం. అయినా.. దేశ జనాభా పెరుగుదలలో ఎలాంటి మార్పు కనిపించించలేదు.

జనాభాను పెంచే దిశగా.. పిల్లల్ని ఎక్కువగా కనే తల్లిదండ్రులకు నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని.. జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు.. పిల్లల్ని కనాలనే ఆలోచన ఉన్న జంటలకు సైతం ఆర్థికసాయాన్ని అందజేస్తోంది. పిల్లల్ని కనాలనుకునే దంపతులను ప్రోత్సహించేందుకు ఇస్తున్న నగదు ప్రోత్సాహకాన్ని సైతం.. 3 లక్షలకు పెంచారు. జనాభా పెంచేందుకు.. ప్రభుత్వం ఎంత కృషి చేస్తున్నా.. బర్త్ రేటులో మాత్రం మార్పు రావడం లేదు. ఇందుకు.. జపాన్‌లో జీవన వ్యయం అత్యధికంగా ఉండటం, జీతాల పెరుగుదల నెమ్మదిస్తుండటమే.. జనాభా తగ్గుదలకు కారణమని.. అక్కడి రిపోర్టులు చెబుతున్నాయ్. ముఖ్యంగా.. ఉద్యోగ అవకాశాలపై లేని స్పష్టత, ప్రయాణాల భారం, కార్పొరేట్ కల్చర్ లాంటి వాటితో.. కుటుంబం, పెళ్లిళ్లపై.. జపాన్ యువత విసుగెత్తిపోయినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. గర్భిణీలు, బాలింతలతో పాటు చిన్నారుల సంరక్షణ కోసం అక్కడి ప్రభుత్వం సబ్సిడీలను ప్రకటిస్తున్నప్పటికీ జనాభా పెరుగుదలలో మాత్రం మార్పు కనిపించడం లేదు.

జపాన్‌ ఇప్పుడు.. ప్రపంచంలోనే అతి తక్కువ సంతానోత్పత్తి రేటును కలిగి ఉంది. ఇది.. స్థిరమైన జనాభాను నెలకొల్పేందుకు అవసరమైన 2.1 రేటు కంటే చాలా తక్కువగా ఉంది. పిల్లల్ని కనే జనాభా తగ్గిపోతున్నప్పుడు.. జపాన్‌లో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. 2020లో ప్రభుత్వ డేటా ప్రకారం.. జపాన్‌లో ప్రతి 15 వందల మందిలో.. ఒకరు వందేళ్ల కంటే ఎక్కువ వయసుగల వారున్నారు. ప్రపంచంలోనే.. అత్యధిక ఆయుర్దాయం ఉన్న దేశాల్లో జపాన్ కూడా ఒకటి. ఇదే సమయంలో.. పదేళ్లలో జననాల కంటే మరణాలే అధికంగా నమోదయ్యాయ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. జనాభా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు.. జపాన్ ప్రభుత్వం.. చైల్డ్ ఫస్ట్ సోషల్ ఎకానమీపై ఫోకస్ పెట్టబోతోంది. చిన్నారులు, కుటుంబాలకు ప్రభుత్వం తరఫున మద్దతిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు.. పిల్లల సంబంధిత కార్యక్రమాలపై.. ప్రభుత్వం అధికంగా ఖర్చు చేయాలని భావిస్తోంది.

Japan Population : పిల్లలను కంటే రూ.3లక్షలు నజరానా.. ప్రభుత్వం బంపర్ ఆఫర్

దేశంలో.. జననాల రేటును పెంచేందుకు.. జపాన్ ప్రభుత్వంగా కొత్తగా ఓ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయబోతోంది. దీని కోసం.. జపాన్ గవర్నమెంట్ తన బడ్జెట్‌లో 3520 కోట్లను కూడా కేటాయించింది. జపాన్ ఇప్పటివరకు.. అక్కడి జంటలను సంతానోత్పత్తికి ప్రోత్సహించడం, పిల్లల్ని కనాలనుకునేవారికి ఆర్థిక ప్రోత్సాహాకాలు అందించడం లాంటివి చేసింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే.. చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీస్ ఏజెన్సీ దేశ వ్యాప్తంగా వివాహాలను పెంచేందుకు కూడా పనిచేస్తుంది. ప్రస్తుతం 15 ఏళ్ల వయసున్న విద్యార్థులకు.. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే దాకా.. నెలకు 6 నుంచి 9 వేలు ఇస్తోంది జపాన్ ప్రభుత్వం. అధిక ఆదాయం కుటుంబాలకు.. కొన్ని పరిమితులతో.. ఈ మొత్తాన్ని మంజూరు చేస్తోంది. అయితే.. వచ్చే ఏడాది నుంచి టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం.. కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా.. 18 ఏళ్ల వయసొచ్చే వరకు ప్రతి చిన్నారికి నెలకు 3 వేలు చెల్లించనుంది. అంతేకాదు.. పుట్టిన శిశువును పెంచేందుకు అవసరమయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించనుంది. ఇందుకోసం.. 60 వేల రూపాయలు ఇవ్వాలని యోచిస్తోంది. అయితే.. ప్రభుత్వ చర్యలకు తగ్గట్లుగా.. జపాన్‌లో జననాల రేటు పెరుగుతుందా.. లేదా.. అన్నది.. రెండు, మూడేళ్లు గడిస్తే గానీ తెలియని పరిస్థితి.