Japan Olympic : టోక్యోలో అథ్లెట్ల కోసం..అద్భుతమైన విలేజ్ చూస్తే కళ్లు చెదిరిపోతాయ్..

ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్ల కోసం ఒలింపిక్ గ్రామంలో ఏర్పాటు చేసిన రిక్రియేషన్ సెంటర్లలో ఒకటి. అథ్లెట్లు సరదాగా కాసేపు సమయాన్ని గడపే ప్లేసులు స్వర్గంలో ఉన్నామా? అనేలా ఉన్నాయి. నిర్వాహక కమిటీ ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్ల కోసం ఒలింపిక్ గ్రామాన్నే నిర్మించింది. దీంట్లో అథ్లెట్ల కోసం కళ్లు చెదిరిపోయే ఏర్పాట్లు చేసింది.

Japan Olympic : టోక్యోలో అథ్లెట్ల కోసం..అద్భుతమైన విలేజ్ చూస్తే కళ్లు చెదిరిపోతాయ్..

Japan Olympic

Japan Olympic village : జపాన్ లో ఒలింపిక్స్ సందడి అంతా ఇంతా కాదు. ఒలింపిక్స్ అంటేక్రీడాకారులకు ఉత్సాహం ఉప్పొంగుతుంది. ఆడాలి..గెలివాలి. పతకాల పంట పండించుకోవాలి. ప్రతీ దేశం తమ క్రీడాకారులను ఒలింపిక్స్ బరిలోకి పంపుతుంది.పతకాలు తేవాలని ప్రోత్సహిస్తుంది. క్రీడాకారులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని పతకాలను దక్కించుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో ఒలింపిక్స్ క్రీడలకు జపాన్ వేదికయ్యింది. అథ్లెట్ల కోసం కళ్లు మైమరపించే ఏర్పాట్లు చేసింది. ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్ల కోసం ఒలింపిక్ గ్రామాన్నే నిర్మించింది. దీంట్లో అథ్లెట్ల కోసం కళ్లు చెదిరిపోయే ఏర్పాట్లు చేసింది.

టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన విశ్వ క్రీడలు జులై 23 నుంచి టోక్యోలో ప్రారంభం కానున్నాయి. 11 వేల మంది అథ్లెట్లు ఈ మెగా క్రీడల్లో పాల్గొననున్నారు. వీరి కోసం అత్యంత ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన క్రీడా గ్రామాన్ని నిర్వాహకులు నిర్మించారు. ఆ ఏర్పాట్లు చూస్తే కళ్లు చెదిరిపోతున్నాయి. జపానా మజాకానా అనిపిస్తోంది.

ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్ల కోసం ఒలింపిక్ గ్రామంలో ఏర్పాటు చేసిన రిక్రియేషన్ సెంటర్లలో ఒకటి. ఇక్కడ అథ్లెట్లు సరదాగా కాసేపు సమయాన్ని గడపే ప్లేసులు స్వర్గంలో ఉన్నామా? అనేలా ఉన్నాయి. నిర్వాహక కమిటీ ఒలింపిక్ గ్రామాన్ని చూపిస్తున్న సమయంలోనే మీడియా కంట పడటానికి ఒలింపిక్స్‌ను వ్యతిరేకిస్తున్న ఆందోళన కారులు బయట బ్యానర్లు ఏర్పాటు చేసిన దృశ్యం కనువిందు చేస్తోంది.

అథ్లెట్లు, అధికారులు, సహాయక సిబ్బంది కోసం ఒలింపిక్ గ్రామంలో ఏర్పాటు చేసిన బ్యాంకు ఏర్పాట్లు చూస్తే మైమరచిపోవాల్సిందే.ఒలింపిక్ గ్రామంలోని అపార్ట్‌మెంట్లలో ఏర్పాటు చేసిన బెడ్లు. ఇవి కార్డ్ బోర్డుతో తయారు చేసిన రీసైక్లబుల్ మంచాలు చూస్తే పడుకోబుద్దికాదు..పడుకుంటే లేవబుద్ది కాదు అన్నట్లుగా ఉన్నాయి. పడుకుంటే హాయిగా నిద్ర పట్టేయటం ఖాయం..ఒలింపిక్ గ్రామంలో ఏర్పాటు చేసిన భవన సముదాయం ఏదో స్వర్గంలోఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది.ఒలింపిక్స్ 2020, పారా ఒలింపిక్స్ 2020 కోసం నిర్మించిన ఒలింపిక్ గ్రామం ఏదో వినూత్న లోకంలో విహరిస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది.