Bicycle Cemetery : సైకిళ్ల శ్మశానం.. ఎక్కడుందో తెలియాలంటే ఓ లుక్కేయండి!

మనుషులు నివాసాలు ఏర్పాటు చేసుకోడానికే ఆ దేశంలో స్థలం దొరకడం లేదు. పాడైపోయిన సైకిళ్ళు పెట్టేందుకు స్థలం లేక యార్డుల్లో పడేస్తున్నారు

Bicycle Cemetery : సైకిళ్ల శ్మశానం.. ఎక్కడుందో తెలియాలంటే ఓ లుక్కేయండి!

Bicycle Cemetery

Bicycle Cemetery : జపాన్.. సాంకేతికతతో అత్యంత అభివృద్ధి చెందిన దేశం. ఈ దేశ విస్తీర్ణం 3లక్షల 70 వేల చదరపు కిలోమీటర్లు. ఇక ఈ దేశ జనాభా దాదాపుగా 13 కోట్లు ఉంటుంది. విస్తీర్ణం పరంగా చిన్నదిగా ఉండటంతో ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడం తలనొప్పిగా మారింది. ఇక ఉన్న భూభాగంలో 30 శాతం వరకు కొండలు, అడవులతోనే నిండి ఉంది. మిగతా 70 శాతం ప్రాంతంలోనే జనాభా నివసిస్తారు. ఇక్కడ పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు నూతన టెక్నాలజీను ఉపయోగిస్తున్నారు. లిఫ్ట్ ల ద్వారా కార్ పార్కింగ్ కి ఏర్పాటు చేశారు. దీని వలన చాలా తక్కువ ప్లేస్ లో ఎక్కువ కార్లను పార్క్ చేసే అవకాశం ఉంటుంది.

చదవండి : Japan’s Princess: యువరాణి పెళ్లికి వేళాయే.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తులు వదిలేసి!

ఇక్కడి ప్రజలు సైకిళ్లను అధికంగా ఉపయోగిస్తారు. సైకిల్ తొక్కడం వలన వాయుకాలుష్యం తగ్గడంతోపాటు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది సైకిళ్లని ఇష్టపడతారు. అదే సమయంలో, పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వారు కోరుకుంటున్నారు. జపాన్‌లో 80 మిలియన్లకు పైగా సైకిళ్లు ఉండటానికి కారణం కూడా ఇదే. అయితే రాను రాను సైకిల్ తొక్కేవారి సంఖ్య తగ్గుతుంది. దీంతో పాతసైకిళ్లను పడేయడానికి స్థలం కరువైంది. పాడైపోయిన సైకిళ్లను నిల్వచేసేందుకు స్థలం లేకపోవడంతో వాటిని యార్డుల్లో పడేస్తున్నారు.

చదవండి : Japan PM : జపాన్​ కొత్త ప్రధానికి మోదీ శుభాకాంక్షలు

దాంతో సైకిళ్ల శ్మశానం తయారైంది. తక్కువ జనాభా ఉన్న సైతామా నగరం నుంచి దాదాపు 70 వేల సైకిళ్లు యార్డులో విసిరేశారు. ఈ సైకిళ్ళ కుప్ప మినీ శ్మశానంగా తయారైంది. అయితే ప్రజలు సైకిళ్ళని యార్డుల్లో వేయడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికైనా అవసరం ఉన్నవారికి ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇలా సైకిళ్ళని పడేయడం వలన విలువైన స్థలాలు సైకిళ్ళ స్మశానాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.