Work-Life Balance: వారానికి నాలుగు రోజులు మాత్రమే పని!!

చాలా వరకూ స్త్రీలు లేదా పురుషులు ఉద్యోగస్థులే ఉన్న జపాన్ జీవన విధానం గురించి కొత్త నిర్ణయం తీసుకుంది. దాదాపు శాలరీల కోసం సమయమంతా ఆఫీసుల్లోనే గడిపేస్తుండటంతో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం దేశవ్యాప్తంగా కొత్త రూల్ తీసుకొచ్చే పనిలో పడింది.

Work-Life Balance: వారానికి నాలుగు రోజులు మాత్రమే పని!!

Japan

Work-Life Balance: చాలా వరకూ స్త్రీలు లేదా పురుషులు ఉద్యోగస్థులే ఉన్న జపాన్ జీవన విధానం గురించి కొత్త నిర్ణయం తీసుకుంది. దాదాపు శాలరీల కోసం సమయమంతా ఆఫీసుల్లోనే గడిపేస్తుండటంతో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం దేశవ్యాప్తంగా కొత్త రూల్ తీసుకొచ్చే పనిలో పడింది. రీసెంట్ గా ఎకనామిక్ పాలసీ గైడ్ లైన్స్ ఇష్యూ చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం వారానికి ఐదు రోజులుగా ఉన్న పనిదినాలను తగ్గించే పనిలో పడింది.

వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేసేలా ఆప్షన్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే కరోనా వైరస్ నేపథ్యంలో జపనీస్ కార్పొరేషన్లో చాలా మార్పులు వచ్చేశాయి.

ఉద్యోగస్థులకు బెనిఫిట్స్
గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంతో వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేసుకోవచ్చు. ఎవరైనా వయస్సులో పెద్ద వారుంటే వారిని చూసుకోవడానికి, ఫ్యామిలీ సమస్య ఏదైనా ఉన్నా వెళ్లిపోవచ్చు. ఇలా పనిదినాలు తగ్గించడం వల్ల ఇతర ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పెంచుకోవచ్చు. అంతేకాకుండా రెగ్యూలర్ జాబ్ బోర్ కొడితే సైడ్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు.

యువత పరస్పరం కలుసుకోవడానికి, పెళ్లిళ్లకు, పిల్లలకు సమయం కేటాయించడానికి వీలుంటుంది. జపాన్ లో జనన రేటు తక్కువగా ఉండటానికి పనివేళలు ఎక్కువ కావడం ఒక కారణమే అని అధికారులు చెబుతున్నారు.

పని ఒత్తిడి ఎక్కువై..
సిబ్బందిలో ఉన్న యువత కూడా ఎక్కువ సమయం పని చేసి అనారోగ్యానికి గురవుతున్నారు. కరోశీ అనే మానసిక ఆందోళన, పని ఒత్తిడి పెరిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నెల ముగిసేసరికి 100గంటలకు పైగా పనిచేసి అనారోగ్యానికి గురవుతున్నట్లు అధికారులు అంటున్నారు.