Making cement with food waste : ఆహార వ్యర్థాలతో సిమెంట్ తయారు చేసిన శాస్త్రవేత్తలు..

టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఫుడ్ వేస్టేజ్‌తో సిమెంట్‌ను తయారు చేయొచ్చని నిరూపించారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఇక భవిష్యత్తులో ఏ నిర్మాణాలకు సిమెంట్‌తో పని ఉండదు.

Making cement with food waste : ఆహార వ్యర్థాలతో సిమెంట్ తయారు చేసిన శాస్త్రవేత్తలు..

Making Cement With Food Waste

Making cement with food waste : ఇప్పటి వరకు మనం సిమెంట్‌తో కట్టిన నిర్మాణాలు చూశాం. పూర్తిగా వుడ్‌తో చేసిన నిర్మాణాలను చూశాం. ఇంకా ధనవంతులైతే పాలరాతితో నిర్మాణాలు చేస్తారు. ఇకపై ఆహార వ్యర్థాల సాయంతో భారీ నిర్మాణాలు చేయొచ్చు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే ! అవును జపాన్‌కు చెందిన టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఫుడ్ వేస్టేజ్‌తో సిమెంట్‌ను తయారు చేయొచ్చని నిరూపించారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఇక భవిష్యత్తులో ఏ నిర్మాణాలకు సిమెంట్‌తో పని ఉండదు.

ప్లాస్టిక్‌, సిమెంట్‌ రహిత జీవితాలను మనం ఊహించుకోలేం. ముఖ్యంగా సిమెంట్‌ లేకుండా ఏ నిర్మాణమూ పూర్తి కాదు. దీనికి కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్మాణాల్లో ఎక్కువగా వినియోగించేది సిమెంట్‌నే ! ప్రపంచంలోని కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలలో సిమెంట్ వాటా 8 శాతం. అయినా దాన్ని రిప్లేస్ చేసే బెటర్ ఆప్షన్స్‌ మన దగ్గర పెద్దగా లేకపోవడం వల్ల ఏమీ చేయలేకపోతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. అవును నిర్మాణాల కోసం సిమెంట్‌ కంటే బెస్ట్‌ ఆప్షన్‌ మనకు చూపిస్తున్నారు.

అందులోనూ ఇది సిమెంట్‌తో పోల్చుకుంటే పర్యావరణ హితమైనది. అందుకే ప్రపంచమంతా జపాన్ శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆసక్తిగా చూస్తోంది. ప్రపంచానికి ప్లాస్టిక్ సమస్య ఎలానో.. జపాన్‌కి ఆహార వ్యర్థాల సమస్య అలానే! అంటే అక్కడ ప్లాస్టిక్ సమస్య లేదని కాదు కానీ.. ఆహార వ్యర్థాలు జపాన్‌లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోతుంటాయి.

జపాన్ 2019లో సుమారుగా 5.7 మిలియన్ టన్నుల ఆహార వ్యర్థాలు పేరుకుపోయాయి. 2030 నాటికి దీన్ని 2.7 మిలియన్ టన్నులను తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి టైంలో దీనికి ఓ చక్కని పరిష్కారాన్ని కనుగొన్నారు టోక్కో శాస్త్రవేత్తలు. ఆహార వ్యర్థాలతో సిమెంట్‌ను తయారు చేస్తున్నారు. టోక్యో యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు కోటా మచిడా, యుయా సకాయ్.

ఈ ఘనతను సాధించారు. టీ ఆకులు, నారింజ మరియు ఉల్లిపాయ తొక్కలు, కాఫీ గ్రౌండ్‌లు, చైనీస్ క్యాబేజీ, లంచ్‌బాక్స్ మిగిలిపోయిన ఆహార వ్యర్థాలను ఉపయోగించి సిమెంట్‌ను తయారు చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆహార వ్యర్థాలతో తయారు చేసిన సిమెంట్‌ ఇది. దీంతో కట్టిన నిర్మాణాలు పేక మేడల్లా కుప్పకూలిపోతాయన్న భయం అస్సలు అవసరం లేదు. ఎందుకంటే ఇలా తయారు చేసిన సిమెంట్‌.. సాధారణ కాంక్రీట్‌ కంటే నాలుగు రెట్లు.. బలంగా, నాణ్యతతో కూడి ఉంటుంది. అంతేకాదు ఈ సిమెంట్‌ గ్లోబల్ వార్మింగ్‌ తగ్గించడంలో కూడా సహాయ పడుతుంది.

ఈ సిమెంట్‌ని ఆహార వ్యర్థాలతో తయారు చేయడం వల్ల ఎలుకలు ఇతర పురుగులు దీన్ని తినేందుకు ప్రయత్నిస్తుంటాయి. అలా జరగకూడదంటే దీనికి రక్షణగా ఏదైనా గమ్ లాంటిది అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సిమెంట్‌ పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి వస్తే.. కాలుష్యానికి కొంత వరకు చెక్ పెట్టొచ్చు.