‘Living’ Skin For Robots : స్పర్శకు స్పందించే రోబో..గాయమైనా దానంతట అదే బాగు చేసుకునే మరమనిషి

కీ ఇస్తే కదిలే రోబోలు వేరు..చార్జింగ్ పెడితే కదిలే రోబోలు వేరు. కానీ ఇప్పుడు స్పర్శకు స్పందించే రోబోలు వచ్చేస్తున్నాయి. అచ్చం మనిషిలా ఉండే ఈ రోజులు వాటికి ..గాయమైనా వాటంతట అవే బాగు చేసుకుంటాయి.

‘Living’ Skin For Robots : స్పర్శకు స్పందించే రోబో..గాయమైనా దానంతట అదే బాగు చేసుకునే మరమనిషి

'living' Skin For Robots

‘Living’ Skin For Robots : ఇప్పుడొస్తున్న రోబోలు మనం చేసే అన్ని పనులు చేసేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మనకంటే తెలివిగా ఆలోచిస్తున్నాయి. ఏఆర్ టెక్నాలజీ సాయంతో మన మెదడుతో పోటీ పడుతున్నాయి. కానీ రోబోని చూడగానే ఇదొక మరమనిషి అన్న భావన కలుగుతుంది. ఎందుకంటే రోబో బాడీ మొత్తం మెటల్‌తో తయారవుతుంది. అందుకే దాన్ని చూసినా.. ముట్టుకున్నా మనకు పెద్దగా ఫీల్ ఉండదు. కానీ అదే రోబో సినిమాలో రజనీకాంత్‌లా ఉంటే.. అది రోబోట్‌ అని ఏ ఒక్కరూ పోల్చుకోలేరు. ఇప్పుడు అలాంటి రోబోని తయారు చేసే పనిలో పడ్డారు జపాన్ శాస్త్రవేత్తలు.

రోబోట్‌ అనేది ఓ మెషిన్‌. దాని రూపమే మనల్ని ఆ భావనలో ఉంచేసింది. అంతా మెటల్ బాడీ.. అడుగేస్తే చెవులు పగిలిపోయే సౌండ్, వింత నడక, ఇంతకు మించి ఏముంటుంది. అసలు రోబో ఇలానే ఎందుకు ఉండాలి. రోబో సినిమాలో రజనీకాంత్‌లో ఎందుకు ఉండకూడదు. మెటల్ బాడీ ప్లేస్ మనలాంటి చర్మాన్ని ఎందుకు దానికి తొడగకూడదు. ఇలాంటి డౌట్లే టోక్యో శాస్త్రవేత్తలకు వచ్చినట్లు ఉన్నాయి. అందుకే ఆ దిశగా ప్రయోగాలు స్పీడప్ చేశారు.. అవి సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యపోతోంది.

రోబోటిక్ సాంకేతికతలో మరో ముందడుగు పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, క్వాంటమ్ కంప్యుటేషన్‌ల వినియోగంతో రోబోటిక్ టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కుతోంది. అచ్చం మనిషిలా కనిపించే రోబోల తయారీకి మార్గం సుగమం అవుతోంది. ఇందులో భాగంగానే టోక్యో పరిశోధకులు బయో హైబ్రీడ్ విధానంలో కంట్రోలబుల్ రోబోటిక్ ఫింగర్‌ని సృష్టించారు. దీనికి సజీవ చర్మకణాలతో రూపొందించిన ఓ తొడుగును వేశారు. దీంతో ఇది స్పర్శకు అనుగుణంగా స్పందిస్తుంది. అంతేకాదు గాయమైనా దానంతట అదే బాగు చేసుకుంటుంది. హైడ్రోజెల్‌గా పిలిచే తేలికపాటి కొలాజెన్‌ను మ్యాట్రిక్స్‌ను ఉపయోగించి ఈ సింథెటిక్ చర్మాన్ని తయారు చేశారు.

ఫైబ్రోబ్లాస్ట్స్‌, కెరాటినో సైట్‌లుగా పిలిచే సజీవ కణాలను ఇందులో పెట్టారు. దీంతో ఇది అచ్చం మానవ చర్మంలానే ఉంటుంది. ఇక భవిష్యత్తులో తయారు చేసే రోబోలు అచ్చం మనిషిలానే కనిపించనున్నాయి. నిజమైన మనుషులెవరో మర మనుషులెవరో పోల్చుకోవడం కూడా కష్టమవ్వొచ్చు.