Viral Video: రహస్యంగా 30 క్షణాల్లో ఆ బాలుడు చేసిన ఈ పనికి రెస్టారెంటుకు రూ.946 కోట్ల నష్టం

చేసిన తప్పును ఆ బాలుడు ఒప్పుకున్నాడు. తనపై వేసిన దావాను కొట్టేవేయాలని కోర్టును కోరాడు.

Viral Video: రహస్యంగా 30 క్షణాల్లో ఆ బాలుడు చేసిన ఈ పనికి రెస్టారెంటుకు రూ.946 కోట్ల నష్టం

Boy Who Licked Soy Bottle

Viral Video – Japan Sushi Chain: ఓ పిల్లాడు రెస్టారెంటుకి వెళ్లి 30 క్షణాల వ్యవధిలో చేసిన పని రూ.946 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. రెస్టారెంటుకు వెళ్లిన బాలుడు అక్కడ ఉన్న సోయా సాస్ బాటిల్ మూత తెరిచి నాకి మళ్లీ టేబుల్ పై పెట్టేశాడు. అక్కడితో ఆగకుండా అక్కడ ఉన్న టీ కప్పులను తీసుకుని నాలుకతో తాకుతూ లాలా జలం అంటించాడు.

తన వేలిని నోటితో పెట్టుకుని తీసి, అతడి పక్క నుంచి వెళ్తున్న ఆహార పదార్థాలపై ఆ వేలిని పెట్టాడు. ఆ సమయంలో అతడి స్నేహితుడు వీడియో తీశాడు. బాలుడి ఉమ్మి అక్కడి కొన్ని వస్తువులు, ఆహార పదార్థాలకు అంటుకోవడం, ఆ వీడియో వైరల్ కావడంతో ఆ రెస్టారెంటు అమ్మకాలు విపరీతంగా పడిపోయాయి.

జపాన్‌లోని సుషీ రెస్టారెంట్ కు చెందిన ఓ ఫ్రాంచైజ్ బ్రాంచ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోను తొలిసారి ఈ ఏడాది జనవరి 29న సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తాజాగా, ఆ బాలుడిపై రెస్టారెంటు బ్రాంచి రూ.3.95 కోట్ల దావా వేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆ బాలుడు చేసిన పనికి సుషీ కంపెనీకి దాదాపు రూ.946 కోట్ల నష్టం వచ్చిందని దావాలో ఆరోపించారు. ఈ ఘటనతో ఆ రెస్టారెంటు బ్రాంచి అకిండో సుషిరో అనేక చర్యలు తీసుకుంటోంది. సీసీ కెమెరాల సంఖ్య పెంచడం, కప్పులు, ఇతర వస్తువులపై ప్లాస్టిక్ కవర్లు ఉండేలా చేయడం వంటి చర్యలు కూడా తీసుకుంది.

తాను చేసిన తప్పును ఆ బాలుడు ఒప్పుకున్నాడు. తనపై వేసిన దావాను కొట్టేవేయాలని కోర్టును కోరాడు. తాను తన స్నేహితుడు కలిసి ప్రాంక్ వీడియో తీద్దామనుకున్నామని, ఆ వీడియోను థర్డ్ పార్టీకి పంపామని, దీంతో అది వైరల్ అయిందని తెలిపాడు.

Odisha train Accident : క్లాసు రూముల్లో మృతదేహాలు .. స్కూలుకెళ్లాలంటే భయపడుతున్న విద్యార్థులు