అమ్మ తోడు అబ్బాయే : హ్యూమన్ డాల్ సోక్యూట్

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 11:08 AM IST
అమ్మ తోడు అబ్బాయే :  హ్యూమన్ డాల్ సోక్యూట్

మేకప్ మాయాజాలం కంటిని కనికట్టు చేసేస్తుంది. ముసలివారిని సైతం నవ యవ్వనంగా చేసేస్తుంది.అలాగే పడుచువారిని కూడా ముసలివారిగా చేసే మాయాజాలం మేకప్ కు ఉంది.  అటువంటి మేకప్ మాయా జాలమే ఈ హ్యూమన్ డాల్. ఈ ఫొటోను చూడగానే అందంగా ఉన్న బొమ్మ అని అనిపించడం ఖాయం. అది బొమ్మకాదు. మనలాంటి మనిషే. అతని పేరు మెట్‌కువాటా. ఆర్టిస్ట్, మోడల్‌గా కూడా పనిచేసే ఇతను ప్రముఖ బేస్‌బాల్ ఆటగాడు మాసూమీ కువాటా కుమారుడు. మెట్‌కు ప్రస్తుతం 24 ఏళ్లు. గత కొంతకాలంగా మెట్‌కువాటా ఇంటర్నెట్‌లో సంచలనంగా మారిపోయాడు. అతని ట్రాన్స్‌ఫార్మేషన్ ఇందుకు కారణంగా నిలిచింది. జపాన్‌లో ఉంటున్న మెట్‌కువాటా మ్యాకప్ సాయంతో ఇలా మారిపోయాడు.

జపాన్‌ సోషల్ మీడియాలో మెట్ కువాటాను ఫారెన్‌ప్రిన్స్‌గా అభివర్ణిస్తున్నారు. చూడగానే మెట్.. యానిమేటెడ్ క్యారెక్టర్ మాదిరిగా కనిపిస్తుంటాడు. చాలామంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని అనుకుంటుంటారు. హ్యూమన్ డాల్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. బ్యూటీ ప్రొడక్ట్స్, ట్రీట్‌మెంట్లపై అమితమైన ఆసక్తి కలిగిన మెట్ ఈ విషయంపై మెట్ మాట్లాడుతూ తాను ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదని చెప్పాడు. మ్యాకప్‌తోనే ఇలా మారగలిగానన్నాడు.