skydrive, ఎగిరే కారు రెడీ..టెస్ట్ డ్రైవ్ సక్సెస్

  • Published By: madhu ,Published On : August 30, 2020 / 08:58 AM IST
skydrive, ఎగిరే కారు రెడీ..టెస్ట్ డ్రైవ్ సక్సెస్

జపాన్ లో ఎగిరే కారు రెడీ అయిపోయింది. టెస్టు డ్రైవ్ సక్సెస్ అయినట్లు జపనీస్ కంపెనీ ప్రకటించింది. స్కైడ్రైవ్ అనే సంస్థ ఈ వాహనాన్ని రూపొందించింది. ఆగస్టు 25వ తేదీన ప్రజల సమక్షంలో ఈ పరీక్ష జరిపినట్లు, ఓ వ్యక్తి నడిపిన ఈ కారు అమాంతం గాల్లోకి లేచింది.

మోటార్ సైకిల్ లా కనిపించే..ఈ వాహనం..ప్రొపెల్లర్ల సాయంతో భూమి పై నుంచి 1-2 మీటర్ మేర గాల్లోకి లేచింది. నాలుగు నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. 2023 నాటికి ఫ్లయింగ్ కారు వాస్తవ రూపంలోకి వస్తుందని స్కైడ్రైవ్ అధిపతి తోమెహిరో పుకుజావ వెల్లడించారు. ప్రస్తుతం దీనిని సేఫ్ గా తీర్చిదిద్దడం ప్రధానమైందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఫ్లయింగ్ కారు తయారు చేయడానికి ఎన్నో సంస్థలు ప్రాజెక్టులు చేపడుతున్నాయని, కానీ..డ్రైవర్ తో సహా గాల్లోకి లేచిన వెహికల్స్ కొన్ని మాత్రమే ఉన్నాయన్నారు. ఈ తరహా కార్లను ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (EVTOL) వాహనాలుగా పేర్కొంటుంటారు.

ఒక చోటు నుంచి మరొకటి చోటుకు వేగంగా..వెళ్లడానికి వీలు కల్పిస్తాయన్నారు. ఆటోమొబైల్ లో ప్రముఖ సంస్థలుగా పేరొందిన టయోటా, ఎలక్ట్రానిక్ సంస్థ పానాసోనిక్ సహా పలు కంపెనీలు దీనికి నిధులు అందించాయి.

ప్రపంచంలో…మొదట్లో రవాణా వ్యవస్థ అంతగా లేదు. గుర్రపు, ఎడ్ల బండ్లు ద్వారా ఎన్నో కిలోమీటర్ల మేర ప్రయాణించే వారు. అనంతరం సైకిళ్లు, రిక్షాలు వచ్చాయి. పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలు మొదలయ్యాయి. ద్విచక్ర, మూడు, నాలుగు చక్రాల వెహికల్స్ రోడ్డెక్కాయి.

1903లో అమెరికాకు చెందిన రైట్ బ్రదర్స్ గాలిలో ఎగిరే విమానాలు కనిపెట్టారు. 1904-1905 సంవత్సరాల్లో విమానాలను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొచ్చారు. హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, ఇలా ఎన్నో రకాల ఫ్లైట్స్ వచ్చాయి. ఇక..గాలిలో ఎగిరే కారు..ఈ వెహికల్ రావాలంటే..కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టాల్సిందే.