Strange Rule : వ్యాక్సిన్ వేయించుకుంటే ఉద్యోగం నుంచి తీసేస్తాం..

కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వం..ఉద్యోగం నుంచి తీసేస్తాం అని వార్నింగ్ఇచ్చిందో కంపెనీ..దీంతో సదరు కంపెనీ షేర్లు మార్కెట్ లో డౌన్ అయిపోయాయి.

Strange Rule :  వ్యాక్సిన్ వేయించుకుంటే ఉద్యోగం నుంచి తీసేస్తాం..

Strange Rule

Strange rule in Japan company : కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటేనే జీతాలు ఇస్తాం అని లేకుంటే జీతాలు ఇచ్చేది లేదని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ జిల్లా కలెక్టర్ ఆశీష్ సింగ్ ప్రభుత్వ ఉద్యోగులకు హుకుం జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ జపాన్ లోని ఓ కంపెనీ మాత్రం మా రూటే సెపరేటు అంటోంది. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే..ఆ ఉద్యోగులకు జీతం ఇవ్వం అని..ఉద్యోగం నుంచి తీసేస్తామని హుకుం జారీ చేసింది. మహమ్మారిని ఖతం చేయటానికి ప్రపంచం అంతా వ్యాక్సినేషన్ వేయించుకోవటం ఒక్కటే మార్గమని చెబుతుంటే..జపాన్ కంపెనీ మాత్రం డిఫరెంట్ అంటోంది.

జపాన్ లో అత్యంత పాపులర్ అయిన తమా హోమ్ అనే హోమ్ బిల్డర్స్ సంస్థ తమ ఉద్యోగులకు ఇటువంటి వింత రూల్ పాస్ చేసింది. సదరు కంపెనీ బాస్ షిన్యా తమాకీ ఇటువంటి ఆదేశాలు జారీ చేశారని ఆ సంస్థలో పనిచేసే సిబ్బంది వాపోయారు. జపాన్ ఇళ్ల నిర్మాణం, వెంచర్లు, తదితర ఎన్నో వ్యాపారాలు చేస్తుంది హోమ్ అనే హోమ్ బిల్డర్స్ సంస్థ. దీనికి చాలా పెద్ద పేరుంది. కానీ వ్యాక్సిన్ వేయించుకున్న ఉద్యోగులకు..కార్మికులకు జీతాలు ఇవ్వం అనీ వారిని ఉద్యోగం నుంచి తీసివేస్తామని ఆదేశాలు జారీ చేయటంతో సదరు సంస్థ షేర్ మార్కెట్ లో దెబ్బతినాల్సి వచ్చింది. ఇటువంటి వింత ప్రకటనతో ఆ కంపెనీ షేర్ల విలువ 10 శాతం పడిపోయింది.

కాగా సదరు కంపెనీ బాస్ వ్యాక్సిన్ తీసుకుంటే వారు ఐదు సంవత్సరాల్లో చనిపోతారని అందుకే తమ ఉద్యోగుల్ని వ్యాక్సిన్ వేయించుకోవద్దని హెచ్చరిస్తున్నాడని..ఈ కంపెనీ ఉద్యోగులు వెల్లడించినట్టు శుకాన్ బుంషుకు అనే మ్యాగజైన్ పేర్కొంది. ఇది వ్యాక్సిన్ విషయంలోనే కాదు..5 జీ ఫోన్లు కూడా అత్యంత ప్రమాదకరమని హోమ్ బిల్డర్స్ సంస్థ బాస్ షిన్యా తమాకీ చెబుతున్నారట. జపాన్ రాజధాని టోక్యోలో గల ఈ హోమ్ బిల్డర్స్ కంపెనీ షేర్లు మూడేళ్ళలో ఎన్నడూ లేనంతగా పడిపోయినట్టు ఈ మ్యాగజైన్ వెల్లడించింది. సగటున ట్రేడింగ్ వ్యాల్యూ 13 రెట్లు తగ్గిపోగా.. టోపిక్స్ ఇండెక్స్ లో దీని శాతం సైతం పడిపోయింది. ఇండియాతో సహా పలు దేశాలతో ఈ సంస్థ తన వ్యాపారాలు చేస్తోంది.

ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకోవద్దని తాము ఎటువంటి నిబంధనా విధించలేదనీ..అస్సలు అటువంటి రూల్ పాస్ చేయలేదని వ్యాక్సిన్ వేయించుకోవాలా? వద్దా?అనేది వారి ఇష్టమని.. తాను ఉద్యోగుల్ని వ్యాక్సిన్ వేయించుకోవద్దనే రూల్ పెట్టాననే వార్తల్ని సదరు కంపెనీ ఖండిచింది. అదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కాగా తమాకీ తన తండ్రి, హోమ్ బిల్డర్స్ కంపెనీ ఫౌండర్ అయిన యసుహితో నుంచి 2018 లో ఈయన బాధ్యతలు స్వీకరించి ఆ వ్యాపారాన్ని అభివృద్ధి బాటలోనడిపిస్తున్నారు తమాకీ.

ఈయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆ కంపెనీ షేర్లు రెట్టింపు అయ్యాయి.ఈక్రమంలో వ్యాక్సిన్ విషయంలో ఆయన ఇటువంటి రూల్ పాస్ చేశాడనే కారణంతో కంపెనీ షేర్ల విలువ 10 శాతం పడిపోయింది.కాగా..వ్యాక్సిన్ వేయించుకోవటంలో జపాన్ ప్రజలు పెద్దగా ముందుకు రావటంలేదు. దీంతో దేశ వ్యాప్తంగా కేవలం 22 శాతం మంది ప్రజలు మాత్రం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.