రోబోలకు ఫీలింగ్స్ తెప్పిస్తున్న సైంటిస్టులు

రోబోలకు ఫీలింగ్స్ తెప్పిస్తున్న సైంటిస్టులు

జపాన్ రోబోల్లో ఫీలింగ్స్ పుట్టిస్తున్నారు సైంటిస్టులు. చెప్పిన పని చెప్పినట్లు ఏం మాట్లాడకుండా చేసేసే రోబోలు ఇక నుంచి ఏడవడం, నవ్వడం వంటివి నేర్పిస్తున్నారు.  రోబో సినిమాలో చిట్టీకి ఫీలింగ్స్ తెప్పించినట్లు వీటి నాడీకణాల్లోనూ ఆర్టిఫిషియల్‌గా ఇంజెక్ట్ చేస్తున్నారు. దీంతో ఈ ఆండ్రాయిడ్ స్పెషల్ రోబోలు విభిన్న ముఖ కవలికలు చూపిస్తున్నాయి. 

అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్ వార్షిక సమావేశం ఫిబ్రవరి 15న జరిగింది. ఈ సందర్భంగా ఒసాకా యూనివర్సిటీకి చెందిన ఎఫ్పెట్టో అనే బుల్లి రోబో.. తలను ముందుకు వెనుకకు కదుపుతూ చిన్న పిల్లోడిలా ఎక్స్‌ప్రెషన్లు ఇవ్వడం మొదలుపెట్టింది. నవ్వడం, గట్టిగా అరవడం వంటివి చేస్తూ మృదువైన చర్మంతో అందరి చూపును కట్టిపడేసింది. 

ముఖ కవలికల కోసం 116 పాయింట్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిజమైన మనుషులుగా కనిపించాలని ఇలా చేశారట. జపాన్ ఇప్పటికే నర్సింగ్ హోమ్‌లలో వీటితోనే పని నడిపిస్తుంది. వర్క్ ఫోర్స్ కావాలసిన ఆఫీసులు, స్కూళ్లు వంటి ప్రదేశాల్లో వీటిని యథేచ్ఛగా వాడేస్తున్నారు.