Princess Mako : ప్రియుడితో పెళ్లి.. 13 ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌దులుకోనున్న‌ యువ‌రాణి

జపాన్ యువరాణి మాకో తన వారసత్వ సంపదను వదులుకోనుంది. చ‌క్ర‌వ‌ర్తి అఖిహిటో ముని మ‌న‌వ‌రాలు .. 29 ఏళ్ల మాకో తన ప్రియుడు కీయ్ కౌమురోను పెళ్లాడనుండి.

10TV Telugu News

princess mako : జపాన్ యువరాణి మాకో తన వారసత్వ సంపదను వదులుకోనుంది. చ‌క్ర‌వ‌ర్తి అఖిహిటో ముని మ‌న‌వ‌రాలు .. 29 ఏళ్ల మాకో తన ప్రియుడు కీయ్ కౌమురోను పెళ్లాడనుండి. అయితే వీరికి 2017లోనే ఎంగేజ్మెంట్ జరిగింది. కౌమురో తల్లి, మాజీ ప్రియుడితో ఉన్న ఆర్ధిక వివాదాల కారణంగా పెళ్లి వాయిదా వేస్తూ వస్తున్నారు.

 

Japan Princess

Read More : Elon Musk Grimes : ప్రియురాలితో విడిపోయిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్

అయితే కౌమురో సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి.. అయితే జపాన్ రాజకుటుంబంలో అనాదిగా వస్తున్న ఆచారం ఒకటి ఉంది. యువరాణి, రాజవంశానికి చెందిన యువకుడిని కాకుండా ఇతరులను చేసుకుంటే ఆమెకు కుటుంబం నుంచి వచ్చే భరణం రాదు.

జపాన్ రాజకుటుంబంలో ఉన్న మహిళలకు 13 లక్షల డాలర్ల వరకు భరణం ఇస్తారు. అయితే యువరాణి మాకో ఓ సాధారణ వ్యక్తిని పెళ్లిచేసుకుంటోంది. ఇలా చేస్తే ఆమె ఈ మొత్తాన్ని వదులుకోక తప్పదు. అయితే డబ్బు వదులుకోవడానికి యువరాణి అంగీకరించినట్లు జపాన్ మీడియా తెలిపింది. ఇక వీరి వివాహం వచ్చే నెలలో జరిగే అవకాశం ఉంది.

Read More : Sneha Dubey : ఎవరీ స్నేహ దుబే..UN వేదికపై పాకిస్థాన్ తీరును చీల్చి చెండాడి..ప్రధాని ఇమ్రాన్ ను ఏకి పారేసిన ధీర..!!

 

Princess