ఎలోన్ మస్క్‌ను దాటేసి వరల్డ్ రిచెస్ట్ పొజిషన్ చేరిన జెఫ్ బెజోస్

ఎలోన్ మస్క్‌ను దాటేసి వరల్డ్ రిచెస్ట్ పొజిషన్ చేరిన జెఫ్ బెజోస్

Jeff Bezos

Jeff Bezos: అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన వ్యక్తిగా స్థానాన్ని మళ్లీ దక్కించుకున్నారు. టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్‌ను దాటేసి యథాస్థానానికి చేరినట్లు ఫోర్బ్స్ రియల్ టైం డేటా చెబుతుంది. మంగళవారానికి అతని ఆదాయం 3.9బిలియన్ డాలర్లు ఉండగా.. టెస్లా షేర్లు 796.22డాలర్ల వద్ద క్లోజ్ అయ్యాయి. అంటే 2.4శాతం కంటే ఎక్కువగా పతనమయ్యాయి.

జనవరిలో బెజోస్ ను అధిగమించిన 49ఏళ్ల ఎంట్రప్రెన్యూర్ ప్రపంచంలోనే అత్యంత రిచ్ పర్సన్ అయ్యారు. దీంతో ర్యాంకింగ్స్ ఆధారంగా 2017నుంచి రిచెస్ట్ పర్సన్ గా ఉన్న మస్క్.. బెజోస్‌కు వరల్డ్ రిచెస్ట్ పర్సన్ టైటిల్‌ను ఇచ్చేశారు.

అమెజాన్ ఫౌండర్ వ్యక్తిగత సంపద, అందులో ఎక్కువగా అమెజాన్ స్టాక్ ఉండటంతో రీసెంట్ గా షేర్ ధర కూడా ఆకాశానికి చేరింది. ఇవే కాకుండా కొత్త మైలురాళ్లు చేరుకునేందుకు బెజోస్ ప్రయత్నిస్తున్నారు. గత ఆగష్టులో 200బిలియన్ డాలర్లకు మించి ఆదాయం కూడగట్టుకున్న వ్యక్తులలో తొలి స్థానంలో ఉన్నారు.

సంవత్సరం చివర్లో అతని పదవి వదిలేసుకోవడానికి రెడీ అవుతుండగా వరల్డ్ రిచెస్ట్ పర్సన్ గా నిలిచాడు. పదవి విడిచిపెట్టినప్పటికీ అతను స్థాపించిన కంపెనీపై తానెప్పుడూ ఓ కన్నేసి ఉంచుతానని బెజోస్ అంటున్నారు. దాంతో పాటే ఇతర ప్రాజెక్టులపైనా ఫోకస్ పెడుతున్నారు. బ్లూ ఆరిజన్ రాకెట్ కంపెనీ, ద వాషింగ్టన్ పోస్ట్ లపై ఫోకస్ పెడతానని ఆయనే చెప్పారు.