అమెజాన్ సీఈవో పదవి నుంచి తప్పుకోనున్న జెఫ్ బెజోస్

అమెజాన్ సీఈవో పదవి నుంచి తప్పుకోనున్న జెఫ్ బెజోస్

jeff-bezos-to-step-down-as-amazon-ceo

Jeff Bezos Amazon CEO : అమెజాన్ సీఈవో పదవి నుంచి జెఫ్ బెజోస్ తప్పుకోనున్నారు. ఈ సంవత్సరం చివరికల్లా ఆయన పదవి నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. బెజోస్ స్థానంలో అమెజాన్ వెబ్ సర్వీస్ హెడ్ అండీ జెస్సీ సీఈవో గా నియామకం కానున్నారు. ఈ సందర్భంగా బెజోస్ తన కంపెనీ ఉద్యోగులకు లేఖ రాశారు. అమెజాన్ అంటే ఒక ఆవిష్కరణ అని, ఇప్పటి వరకు కనిపెట్టుకుంటూ వచ్చానని..ఇక ఈ పదవి నుంచి మారడం సరైన సమయంగా వెల్లడించారు. ఈ ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికానికల్లా పదవి నుంచి తప్పుకుని..అండీ జెస్సీకి పగ్గాలు అప్పచెప్పనున్నట్లు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా వ్యవహరించనున్న బెజోస్..బెజోస్ ఎర్త్ ఫండ్, బ్లూ ఆర్జిన్ స్పేష్ షిప్, అమెజాన్ డే 01 ఫండ్ పై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.

సీఈవో పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఆయన చేసిన ప్రకటనతో అమెరికా వ్యాపారవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. అయినా..అమెజాన్ వ్యాపారంపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపెట్టలేదు. ఇక నూతన సీఈవోగా బాధ్యతలు తీసుకోనున్న అండీ జెస్సీ 1997లో అమెజాన్ లో మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేశారు. 2003లో అమెజాన్ వెబ్ సర్వీసు ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 27 ఏళ్ల క్రితం ఇంటర్నెట్ లో పుస్తకాలు అమ్మేందుకు అమెజాన్ ను బెజోస్ ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారారు.