పాకిస్తాన్ కుట్ర : మసూద్ అజార్ చనిపోయాడని దుష్ప్రచారం

పాకిస్తాన్ మీడియా కొత్త డ్రామా ఆడింది. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్ చనిపోయాడు అని సోషల్ మీడియాలో దుష్ప్రచారం

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 01:45 AM IST
పాకిస్తాన్ కుట్ర : మసూద్ అజార్ చనిపోయాడని దుష్ప్రచారం

పాకిస్తాన్ మీడియా కొత్త డ్రామా ఆడింది. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్ చనిపోయాడు అని సోషల్ మీడియాలో దుష్ప్రచారం

పాకిస్తాన్ మీడియా కొత్త డ్రామా ఆడింది. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్ చనిపోయాడు అని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసింది.  మసూద్ చనిపోయినట్టు వార్తలు పుట్టించి ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. వాస్తవానికి మసూద్ బతికే ఉన్నాడు. మసూద్‌ను పాకిస్తాన్ ఆర్మీ రహస్య స్థావరానికి తరలించింది.  కోట్‌ఘని భవహాల్‌పూర్‌లోని రహస్య ప్రాంతంలో ఉంచింది. అనారోగ్యంతో ఉన్న అతడికి వైద్యం అందిస్తున్నారు.

మసూద్ మరణించాడు అని సోషల్ మీడియాలో పాక్ మీడియా ప్రచారం చేసింది. ఫిబ్రవరి 26న బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం చేసిన ఎయిర్ స్ట్రయిక్స్‌లో మరణించిన  టెర్రరిస్టుల్లో మసూద్ కూడా ఉన్నాడని కథలు పుట్టించింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మసూద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని పుకార్లు సృష్టించింది. మసూద్  మరణించాడన్న వార్తలు అంతర్జాతీయంగా హల్ చల్ చేశాయి. పాక్ కథనాలు చూసి మసూద్ చచ్చాడని ప్రపంచం అనుకుంది. కానీ వాస్తవానికి మసూద్ చావలేదు.

మసూద్ అజార్ తమ దేశంలోనే సురక్షితంగా ఉన్నాడని ఇటీవలే పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి అంగీకరించారు. మసూద్ నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పారు. ఆ తర్వాత మసూద్  కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని, డయాలసిస్ చికిత్స పొందుతున్నాడని కథనాలు వెలువడ్డాయి. ఇంతలో మసూద్ మరణించినట్లు వార్తలు పుట్టించారు. ఇదంతా పాక్ మరో  కుట్రలో భాగమేనని తేలిపోయింది.