ట్రంప్..ప్రెసిడెంట్ పదవి పోయిందని బాధపడకు..మా మున్సిపాలిటీలో ఉద్యోగం ఇస్తాం : జెరూసలేం ఆఫర్

  • Published By: nagamani ,Published On : November 9, 2020 / 11:00 AM IST
ట్రంప్..ప్రెసిడెంట్ పదవి పోయిందని బాధపడకు..మా మున్సిపాలిటీలో ఉద్యోగం ఇస్తాం : జెరూసలేం ఆఫర్

Jerusalem municipal Trump job offer : డియర్..డొనాల్డ్ ట్రంప్ గారూ..అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయి ప్రెసిడెంట్ పదవి దక్కలేదని బాధ పడొద్దు..మీకు మేం ఉద్యోగం ఇస్తాం రండీ..అంటూ జెరూసలేమ్ మునిపల్ అధికారులు పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఎన్నికల్లో ఓడిపోయి ఓటమిని అంగీకరించకుండా నేను న్యాయపోరాటం చేస్తాను…అంటూ చిన్నపిల్లాడిలా మారాం చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో జెరూసలేంలోని మున్సిపల్ అధికారులు ట్రంప్ కు ఓ ఉద్యోగాన్ని ఆఫర్ చేశారు. దీనికి సంబంధించి ఓ పోస్ట్ కూడా పెట్టి కలకలం రేపారు.


ట్రంప్ కు అధ్యక్షుడిగా ఉద్యోగం పోయినందుకు తెగ బాధపడిపోతున్నాడనీ..తట్టుకోలేకపోతున్నాడనీ కాబట్టి ఆయనకు ఉద్యోగం లేని బాధ పడవద్దని..తమ సంస్థలో ఉద్యోగం ఇస్తామని, జెరూసలేమ్ మునిసిపల్ అధికారులు తమ అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.


ఇది వైరల్ కావడంతో వెంటనే దాన్ని ఉన్నతాధికారులు తొలగించారు. ఈ పోస్ట్ అనుకోకుండా వచ్చిందని పురపాలక అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించడం గమనించాల్సిన విషయం. ఇక ట్రంప్ కు ఉద్యోగం ఇచ్చేందుకు తాము సిద్ధమంటే, తాము సిద్ధమని పలు కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడు తమ కంపెనీలు ఉద్యోగం ప్రకటించటం ప్రిస్టేజ్ గా భావిస్తున్నట్టున్నాయి.



https://10tv.in/ghaziabad-thief-busted-wearing-namo-again-t-shirt-police-removed-tweet/
కాగా..అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఓటమి తప్పలేదు. గెలుపు కోసం ట్రంప్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మెజార్టీ ఓట్లతో డెమాక్రాట్ అభ్యర్థి జో బైడెన్ 284 ఎలక్టోరల్ ఓట్లతో ట్రంప్ పై విజయం సాధించారు. ట్రంప్ కేవలం 214 ఎలక్టోరల్ ఓట్లతో ఓటమిపాలయ్యారు. గెలిచిన బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.


పరాజయం మూటగట్టుకున్న ట్రంప్.. తుది ఫలితాలకు ముందే రిగ్గింగ్, మోసాలకు పాల్పడ్డారంటూ డెమోక్రాట్ అభ్యర్థులపై సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. దాంతో ఓటమితో ఒత్తిడిని తట్టుకునేందుకు ట్రంప్ చిన్నపిల్లాడిలా మారిపోయారు.




వైట్ హౌస్ లోనే ఉంటానంటూ ట్రంప్ మారం చేసినట్టుగా ఉంది.. వైట్‌హౌస్‌ వీడాల్సిన సమయం ఆసన్నమైందంటూ ట్రంప్‌పై నెటిజన్లు సోషల్‌మీడియాలో ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.