ఆకాశమంత ఆత్మవిశ్వాసం: చేతులు లేకపోయినా..విమానం నడిపేస్తోంది 

  • Published By: veegamteam ,Published On : April 19, 2019 / 08:16 AM IST
ఆకాశమంత ఆత్మవిశ్వాసం: చేతులు లేకపోయినా..విమానం నడిపేస్తోంది 

సంకల్ప బలం ఉంటే సాధించలేదని ఏదీ లేదనేది అనుభవజ్ఞులు చెప్పేమాటను అక్షర సత్యం చేసి చూపించింది ఓ యువతి. చేతులు లేకుండా తన దృఢ సంకల్పంతో విమానం పైలెట్ గా రికార్డు సృష్టించింది ఓ అమ్మాయి. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ ఆత్మవిశ్మాసం ఉంటే దేన్నైనా జయించవచ్చనే అనేదానికి ఈమె నిలువెత్తునిదర్శనంగా..స్ఫూర్తిగా నిలుస్తోంది అమెరికాకు చెందిన జెస్సికా కాక్స్.. 
 

ప్రపంచంలోనే ఏకైక..ఆర్మ్‌లెస్ (చేతుల్లేని) పైలట్‌గా చరిత్ర సృష్టించింది జెస్సికా కాక్స్. కాళ్లతో విమానం నడుపుతూ.. ఔరా అనిపిస్తోంది. ఎన్ని రికార్డులైనా ఈమె సంకల్పం ముందు చిన్నబోతాయి. అటువంటి జెస్సికా  గిన్నీస్ రికార్డులకు ఎక్కటం ఓ లెక్కా..ఆ గిన్నిస్ రికార్డును సైతం బద్దలకొట్టింది చేతుల్లేకుండా పుట్టిన జెస్సికా.  

22 ఏళ్ల వయస్సు..చిన్ననాట కృత్రిమ చేతులతో కొన్ని పనులు చేసినా 14 ఏళ్ల వయస్సులో అవికూడా వద్దనుకుంది. అప్పటి నుంచి కాళ్లతోనే పనులు చేయడం చేసేస్తోంది. ఈ క్రమంలో పలు కీలక కష్టాలను అధిగమించి తన 22 ఏళ్ల వయస్సులోనే విమానం నడపడం కూడా నేర్చుకుంది. అలా కేవలం మూడేళ్లలోనే పైలట్ లైసెన్స్‌ కూడా దక్కించుకోవటం జెస్సికా సాధించిన మరో ఘన విజయం. 
 
భోజనం చేయడం నుంచి రాయడం వరకు ప్రతి పని కాళ్లతోనే చేయటమే కాదు కాళ్లతో అవలీలగా టైపింగ్ చేసేస్తుంది.  నిమిషానికి 25 అక్షరాలను చకచకా కొట్టేస్తుంది. అంతేకాదు..జెస్సిగా చేసే సాహసాల గురించి వింటే ఒళ్లు గగొర్పొడుస్తుంది. సర్పింగ్, స్కూబా డైవింగ్, గుర్రపు స్వారీ వంటివి కూడా జెస్పికా డేరింగ్ డేషింగ్ గా చేసేస్తుంది. జెస్సికా వివాహం కూడా స్పెషలే. చేతులు లేవు కాబట్టి వెడ్డింగ్ రింగ్ ను ఆమె సహచరుడు ప్యాట్రిక్ చైంబరలేన్ ఆమె కాలికి ఉంగరం తొడికి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చూసారా చేతులు లేకుండా ఆమె సాధించిన ఘనతలు ఒకటీ రెండూ కాదు..వ్యక్తిత్వంలో ఆమె ఆకాశాన్ని మించి పోయింది. ఆత్మస్థైర్యంలో ఆమెకు ఆమే సాటిగా నిలిచింది జెస్సికా కాక్స్..