వైట్ హౌస్ లో వాలెంటైన్స్ డే, పచ్చిక బయల్లో లవ్ సింబల్స్

వైట్ హౌస్ లో వాలెంటైన్స్ డే, పచ్చిక బయల్లో లవ్ సింబల్స్

Valentine’s Day decorations : ఫిబ్రవరి 14. వాలెంటైన్స్ డే..ప్రేమికుల రోజు కొద్ది గంటల్లో రాబోతోంది. ఫుల్ గా సెల్రబేషన్స్ జరుపుకోవడానికి ప్రేమికులు సిద్ధమైపోతున్నారు. తీపి గుర్తులకు ఇది స్పెషల్ గిఫ్ట్ డే. ప్రేమను వ్యక్తపరచడానికి..ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముందుగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు బైడెన్ ఆయన భార్య జిల్. యూనిటీ, హోప్, లవ్ రాసి ఉన్న రెడ్ హార్ట్ లతో భారీ పింక్ పోస్టర్లను వైట్ హౌస్ ఎదుట ఉన్న పచ్చికబయల్లో వీటిని ఏర్పాటు చేశారు.

ప్రేమతో పెంచుకుంటున్న రెండు జర్మన్ కుక్కలు మేజర్, ఛాంప్ లతో సర్ ఫ్రైజ్ విజిట్ చేశారు బైడెన్ దంపతులు. జిల్ ఇష్టమైన సెలవుదినాల్లో వాలెంటైన్స్ డే ఒకటని ఆమె కార్యాలయం వెల్లడించింది. ప్రథమ మహిళకు ఇష్టమైన రోజు అని బైడెన్ తెలిపారు. తాను ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో..ఇంట్లో కిటికీలన్నింటికీ లవ్ సింబల్ తో ఉన్న పోస్టర్లను ఏర్పాటు చేసిందన్నారు. కరోనా కాలంలో అమెరికన్లకు మీరు ఎలాంటి ‘లవ్ స్టోరీ’ ని ఇవ్వాలని విలేకరులు ప్రశ్నించారు. ప్రతొక్కరూ బలంగా, శక్తివంతంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇలా ఉంటే…కరోనా వైరస్ ఉన్న సమయంలో మునుపటిలా ఉత్సాహంగా జరుపుకోలేకపోవచ్చని జిల్ తెలిపారు. అయినా..కొద్దిపాటి జాయ్, లిటిల్ హోప్ ఉండాల్సిందేనన్నారు.

ప్రేమికుల రోజు వచ్చిందంటే..చాలు..అమెరికన్లు భారీగా ఖర్చు పెడుతుంటారు. వాలెంటైన్స్ వేడుకల్లో అగ్రరాజ్యం అగ్రస్థానంలో ఉంటుంది. భారీగా పువ్వులు, స్వీట్స్, క్యాండిల్స్ కొనుగోలు చేస్తారు. అంతేగాకుండా..కొత్త దుస్తులు, గ్రీటింగ్ కార్డుల కోసం భారీగా ఖర్చు పెట్టడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోందంట. అక్కడ క్రిస్మస్ తర్వాత జరిగే అతి పెద్ద వేడుకల్లో భాగమైపోయింది.