Joe Biden: వ్యాక్సిన్ వేసుకునే వారికి 100డాలర్లు ఇవ్వాలి – జో బైడెన్

కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం వచ్చే వారికి వంద డాలర్లు ఇవ్వాలని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలకు సూచించారు. అంతేకాకుండా అమెరికా బలగాల్లోని అవసరమైన వారికి కొవిడ్-19 షాట్స్ ఇప్పించాలని పెంటగాన్ ను అడిగారు.

Joe Biden: వ్యాక్సిన్ వేసుకునే వారికి 100డాలర్లు ఇవ్వాలి – జో బైడెన్

Joe Biden

Joe Biden: కొవిడ్ వ్యాక్సిన్ వచ్చే వారికి వంద డాలర్లు ఇవ్వాలని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలకు సూచించారు. అంతేకాకుండా అమెరికా బలగాల్లోని అవసరమైన వారికి కొవిడ్-19 షాట్స్ ఇప్పించాలని పెంటగాన్ ను అడిగారు.

‘దీని గురించి ఆలోచిస్తుంటేనే ఏదో కోల్పోతున్నట్లుగా ఉంది. ఇంకా మనం పోరాడాల్సి ఉంది. కొత్త సమస్యలు, ఛాలెంజ్‌లు లేకపోతే సింపుల్ గా ఉండేది కానీ నిజ జీవితంలో అలా జరగదు కదా. అని బైడెన్ అన్నారు. అంతకంటే ముందే సెంటర్స్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని చెప్పింది. కరోనావైరస్ ప్రభావంతో చనిపోతున్న వారిలో కేవలం ఒక్క శాతం మాత్రమే వ్యాక్సినేషన్ వేసుకుని చనిపోతున్నారు.

ప్రెసిడెంట్, ఫెడరల్ గవర్నమెంట్ వర్కర్లు తప్పకుండా వ్యాక్సినేషన్ వేసుకోవాలి. మాస్కులు ధరించాలి. రెగ్యూలర్ గా పరీక్షలు చేయించుకోవాలి. వైట్ హౌజ్ డెల్టా వేరియంట్ గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది సీడీసీ చెప్పింది.

‘ఫెడరల్ గవర్నమెంట్ ప్రతి ఉద్యోగి వ్యాక్సినేషన్ స్టేటస్ ను ప్రదర్శించాలి. అలా చేయని వారు మాస్క్ తప్పకుండా ధరించాలి. వాళ్లు ఎక్కడ పనిచేసినా సరే.. వారానికి ఒకట్రెండు సార్లు పరీక్ష చేయించుకోవాలి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలి. ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలి. మన జీవితాలను మళ్లీ సాధారణ స్థాయికి తెచ్చుకోవాలి. వర్క్ ప్లేసుల్లో పూర్తి వ్యాక్సినేషన్ చేయించుకోవడం వీలైనంత త్వరగా పూర్తి చేయాలి’ అని బైడెన్ అన్నారు.

వ్యక్తిగత వ్యాక్సినేషన్ కారణంగా లేదా వారి కుటుంబ సభ్యులు వ్యాక్సినే్ వేసుకున్న కారణంగా ఎవరైతే పనికి హాజరుకాలేకపోతారో.. వారికి ఆర్థిక సాయం చేయాలని అన్నారు ప్రెసిడెంట్ బైడెన్.