ISIS Chief Death: అమెరికా బలగాలను చూసి ఇల్లు పేల్చుకుని ఐసిస్ చీఫ్ మృతి

ఐసిస్ ముఖ్య నాయకుడు "అబు ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురాషి" ఇంటితో సహా తనను తాను పేల్చుకుని మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

ISIS Chief Death: అమెరికా బలగాలను చూసి ఇల్లు పేల్చుకుని ఐసిస్ చీఫ్ మృతి

Biden

ISIS Chief Death: తీవ్రవాద సంస్థ ఐసిస్ ముఖ్యనాయకుడు “అబు ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురాషి” ఇంటితో సహా తనను తాను పేల్చుకుని మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. గురువారం ఉత్తర సిరియాలోని.. అత్మే.. పట్టణంలో జరిగిన ఈ ఘటనలో ప్రపంచంలో ప్రమాదకర వ్యక్తి అయిన.. అబు ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురాషిని అమెరికా భద్రతాదళాలు వీరోచితంగా మట్టుపెట్టినట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. గురువారం కొబాని నుంచి హెలికాప్టర్ ద్వారా అత్మే పట్టణానికి చేరుకున్న అమెరికా బలగాలు.. అల్-ఖురాషి నివసిస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. అమెరికా సైనిక దళాల హెలికాప్టర్ శబ్దాలు విన్న స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.

Also read: Galwan Attacks: గాల్వాన్ ఘర్షణలపై ప్రకంపనలు సృష్టిస్తున్న ఆస్ట్రేలియా పేపర్ కథనం

అనంతరం అల్-ఖురాషి నివసిస్తున్న ఇంటిని అమెరికా బలగాలు చుట్టుముట్టేందుకు వస్తుండగా.. వారిని గమనించిన అల్-ఖురాషి.. తనతో సహా, ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులతో పాటు ఇంటిని బాంబు పెట్టి పేల్చివేశాడు. ఈఘటనలో రెండంతస్తుల భవనం కూలిపోగా.. అల్-ఖురాషి అతని ముగ్గురు పిల్లలు, భార్య అక్కడికక్కడే మృతి చెందారని అమెరికా దళాలు తెలిపాయి. ఐసిస్ ముఖ్య నాయకుడైన “అబు ఇబ్రహీం అల్-హషిమీ అల్-ఖురాషి” మరణంతో ఐసిస్ ఉగ్రవాద సంస్థకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 2019లోనే ఐసిస్ అసలు నాయకుడు అబూ బకర్ అల్-బగ్దాదీ ఇదే తరహాలో ఇల్లు పేల్చుకుని ఆత్మహత్యకు పాల్పడగా.. ఇప్పుడు అల్-ఖురాషి సైతం అదే తరహాలో మృతి చెందాడు. దీంతో ఐసిస్ మూలాలు ఇక తునాతునకలైనట్లుగా యూఎస్ ప్రభుత్వం అభివర్ణించింది.

Also read:Flower Species: 99 మిలియన్ సంవత్సరాల పుష్పాల శిలాజాలు గుర్తింపు

ఇరాక్ కు చెందిన అల్-ఖురాషి.. అసలు పేరు అమీర్ మహమ్మద్ అబ్ద్ అల్-రెహ్మాన్ అల్-మావ్లా. ఇరాక్ లోని తుర్క్మెన్ ప్రజలు ఎక్కువగా నివసించే తాల్ అఫర్ పట్టణంలో నివసించేవాడు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఇతని గురించి సమాచారం అందించిన వారికి యూఎస్ ప్రభుత్వం $10 మిలియన్ డాలర్లు రివార్డు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. అత్మే పట్టణంలో ఐసిస్ మద్దతుదారైనా..అల్ ఖైదా తీవ్రవాది నక్కి ఉన్నట్లు సమాచారం అందుకున్న యూఎస్ భద్రతాబలగాలు..అక్కడున్నది ఐసిస్ నాయకుడు అల్-ఖురాషిగా గుర్తించారు. తాము ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్న అల్-ఖురాషి తనకు తానే పేల్చివేసుకున్నట్లు అమెరికా సైనికులు వెల్లడించారు.

Also read:ISRO Rockets: చంద్రయాన్ 3 సహా 19 ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన ఇస్రో